Delhi: గుజరాత్‌లో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ.. బీజేపీలో చేరిన రోహన్ గుప్తా
లోక్‌సభ ఎన్నికలకు ముందు గుజరాత్‌లో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ నేత రోహన్ గుప్తా ఈరోజు బీజేపీలో చేరారు. బీజేపీ ప్రధాన కార్యదర్శులు వినోద్ తావ్డే, హర్దీప్ సింగ్ పూరీలు ఆయనకు బీజేపీ సభ్యత్వం ఇచ్చారు. రోహన్ గుప్తా మార్చి 22న కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. బీజేపీలో చేరిన తర్వాత రోహన్ గుప్తా మీడియాతో మాట్లాడారు. సనాతన ధర్మాన్ని కాంగ్రెస్ అవమానిస్తుందన్నారు. రాముడ్ని కాంగ్రెస్ అవమానించడం తనకు నచ్చలేదని పేర్కొన్నారు. కేజ్రీవాల్‌కు మద్దతు తెలపడం ఏ మాత్రం బాగోలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో అవమానాలు భరించలేకే కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు రోహన్ గుప్తా తెలిపారు. రెండేళ్లు ఎన్నో అవమానాలు భరించినట్లు ఆయన ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
సంజయ్ నిరుపమ్‌ను పార్టీ నుంచి సస్పెండ్
లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇటీవల రాజస్థాన్‌కు చెందిన గౌరవ్ వల్లభ్, మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ నాయకుడు సంజయ్ నిరుపమ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. సనాతన్ ఆధారంగా గౌరవ్ పార్టీని వీడగా, సంజయ్ నిరుపమ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే, తాను ఇప్పటికే తన రాజీనామాను కాంగ్రెస్ అధ్యక్షుడికి సమర్పించినట్లు సంజయ్ ప్రకటించారు.