NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / UPSC: యూపీఎస్సీ ఛైర్మన్‌గా మాజీ రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్ నియామకం 
    తదుపరి వార్తా కథనం
    UPSC: యూపీఎస్సీ ఛైర్మన్‌గా మాజీ రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్ నియామకం 
    యూపీఎస్సీ ఛైర్మన్‌గా మాజీ రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్ నియామకం

    UPSC: యూపీఎస్సీ ఛైర్మన్‌గా మాజీ రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్ నియామకం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 14, 2025
    09:41 am

    ఈ వార్తాకథనం ఏంటి

    యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) చైర్మన్ పదవికి మాజీ రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ నియమితులయ్యారు.

    కేంద్ర వ్యక్తిగత వ్యవహారాల శాఖ ఈ నియామకాన్ని అధికారికంగా ప్రకటించింది.

    గతంలో యూపీఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించిన ప్రీతి సుదన్ పదవీకాలం ఏప్రిల్ 29వ తేదీన ముగియడంతో ఆ స్థానం ఖాళీగా ఉండిపోయింది.

    తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాల మేరకు అజయ్ కుమార్‌ను యూపీఎస్సీ చైర్మన్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

    అజయ్ కుమార్ 1985 బ్యాచ్‌కు చెందిన భారత పరిపాలన సేవ (ఐఏఎస్) అధికారి. ఆయన కేరళ క్యాడర్‌కు చెందినవారు.

    వివరాలు 

    చైర్మన్‌తో పాటు మొత్తం పదిమంది సభ్యులు

    ఆయన 2019 ఆగస్టు 23వ తేదీ నుంచి 2022 అక్టోబర్ 31వ తేదీ వరకు రక్షణ శాఖ కార్యదర్శిగా పనిచేశారు.

    దేశంలోని అత్యున్నత సివిల్ సర్వీస్ పరీక్షలను నిర్వహించే బాధ్యత యూపీఎస్సీకి ఉంటుందన్న విషయం తెలిసిందే.

    ఇందులో ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ లాంటి కీలక సర్వీసులతో పాటు ఇతర సర్వీసుల‌కు సంబంధించిన పరీక్షల నిర్వహణ బాధ్యత యూపీఎస్సీదే.

    యూపీఎస్సీలో ఒక చైర్మన్‌తో పాటు మొత్తం పదిమంది సభ్యులు ఉంటారు.

    ప్రస్తుతానికి ఈ కమిషన్‌లో రెండు సభ్య పదవులు ఖాళీగా ఉన్నాయి.

    యూపీఎస్సీ చైర్మన్ పదవికి గరిష్ఠ కాలపరిమితి ఆరు సంవత్సరాలు. అయితే పదవిలో కొనసాగడానికి వ్యక్తి వయసు 65 ఏళ్లను మించకూడదనే నిబంధన ఉంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    UPSC ఛైర్మన్‌గా మాజీ రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్ నియామకం 

    Former Defence Secretary Ajay Kumar appointed as UPSC Chairman. pic.twitter.com/u2w0pFZFvA

    — ANI (@ANI) May 14, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ద్రౌపది ముర్ము

    తాజా

    UPSC: యూపీఎస్సీ ఛైర్మన్‌గా మాజీ రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్ నియామకం  ద్రౌపది ముర్ము
    Tech Layoffs: భారీ లేఆఫ్స్ దిశగా మైక్రోసాఫ్ట్ అడుగులు.. దాదాపు 6 వేల మంది తొలగింపుకు ప్రణాళిక సిద్ధం మైక్రోసాఫ్ట్
    S Jaishankar: భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలు.. ఎస్. జైశంకర్‌ భద్రతా ఏర్పాట్లలో ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ కారు.. సుబ్రమణ్యం జైశంకర్
    Pakistan envoy: బంగ్లాదేశ్‌లో హనీట్రాప్‌ వివాదంలో పాక్‌ దౌత్యవేత్త.. అమ్మాయితో అశ్లీల వీడియోలు.. బంగ్లాదేశ్

    ద్రౌపది ముర్ము

    రెజ్లర్ల సమస్యలను చెప్పేందుకు రేపు రాష్ట్రపతి, అమిత్ షాను కలవాలని ఖాప్ నేతల నిర్ణయం  రెజ్లింగ్
    రాష్ట్రపతి ముర్ముకు అరుదైన గౌరవం.. సురినామ్ దేశ అత్యున్నత పౌర పురస్కారం రాష్ట్రపతి
    కారుణ్య మరణానికి సిద్దపడ్డ జ్ఞాన్‌వాపి మసీదు కేసు మాజీ పిటిషనర్; రాష్ట్రపతికి లేఖ  ఉత్తరాఖండ్
    హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. నగరంలో భారీ భద్రతా, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు రాష్ట్రపతి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025