LOADING...
Chandrababu: రూ.45,300 కోట్లతో నాలుగు గ్రీన్‌ఫీల్డ్‌ రహదారుల నిర్మాణం: చంద్రబాబు 
రూ.45,300 కోట్లతో నాలుగు గ్రీన్‌ఫీల్డ్‌ రహదారుల నిర్మాణం: చంద్రబాబు

Chandrababu: రూ.45,300 కోట్లతో నాలుగు గ్రీన్‌ఫీల్డ్‌ రహదారుల నిర్మాణం: చంద్రబాబు 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 24, 2024
05:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

రూ.45,300 కోట్లతో నాలుగు గ్రీన్‌ఫీల్డ్‌ రహదారుల నిర్మాణం జరగనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రస్తుతం 6 ప్రాజెక్టులు బిడ్డింగ్‌ దశలో ఉన్నాయని, 15 ప్రాజెక్టులు నిలిచిపోయాయని చెప్పారు. 75 ప్రాజెక్టులకు భూసేకరణ సమస్యలు, 23 ప్రాజెక్టులకు అటవీ అనుమతుల సమస్యలు ఎదురవుతున్నాయని వివరించారు. మొత్తం 95 ప్రాజెక్టులకు వివిధ సమస్యలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో చేపట్టబోయే ప్రాజెక్టుల భూసేకరణను 3 నెలల్లో పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. బెంగళూరు-కడప-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ వేకు పర్యావరణ అనుమతుల సమస్యలు ఉన్నాయని, వీటిని 15 రోజుల్లో సాధించాలని అన్నారు.

వివరాలు 

ఆక్వా, హార్టికల్చర్‌ రంగాలలో ఎగుమతులకు మంచి అవకాశాలు

ప్రాజెక్టులన్నీ నిర్ణీత కాలవ్యవధిలో పూర్తవ్వాలని సీఎం తెలిపారు. దాదాపు రూ.18 వేల కోట్లతో పనులు పూర్తి చేయబోతున్నామన్నారు. రెండున్నరేళ్లలో రూ.50 వేల కోట్లతో అన్ని ప్రాజెక్టులను ముగించాల్సి ఉందని వివరించారు. హైదరాబాద్‌ నుంచి మచిలీపట్నం వరకు గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణం త్వరలో ప్రారంభం అవుతుందని, ఏపీ ఎకో గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌గా మారబోతోందని సీఎం పేర్కొన్నారు. ఆక్వా, హార్టికల్చర్‌ రంగాలలో ఎగుమతులకు మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు.