LOADING...
Indus Waters Treaty: 'రక్తం,నీరు కలిసి ప్రవహించలేవు' నుండి సింధు జల ఒప్పందం వరకు.. రాజ్యసభలో జైశంకర్‌ 
రాజ్యసభలో జైశంకర్‌

Indus Waters Treaty: 'రక్తం,నీరు కలిసి ప్రవహించలేవు' నుండి సింధు జల ఒప్పందం వరకు.. రాజ్యసభలో జైశంకర్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 30, 2025
02:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడికి భారత ప్రభుత్వం 'ఆపరేషన్ సిందూర్'తో గట్టిగా ప్రతిస్పందించింది. ఇందులో భాగంగా, భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య ఉన్న సింధూ జలాల ఒప్పందం (Indus Waters Treaty) అమలును తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నిర్ణయం పాకిస్థాన్‌కు తీవ్ర దెబ్బవ్వగా, అది కొనసాగుతుందని బుధవారం రాజ్యసభలో విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్ స్పష్టం చేశారు. "నీరు,రక్తం కలిసిపోవడం సాధ్యం కాదు" అని ఆయన మరోసారి స్పష్టంగా పేర్కొన్నారు. అప్పట్లో ఈ ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో భారత నాయకత్వం, ముఖ్యంగా అధికారంలో ఉన్న వారు, దేశ రైతుల ప్రయోజనాల కన్నా పాకిస్థాన్‌కు మేలు జరిగేలా చర్యలు తీసుకున్నారంటూ ఆయన విమర్శించారు.

వివరాలు 

ఆర్టికల్ 370 రద్దు ఒక ఉదాహరణ

కాంగ్రెస్ పార్టీ పాలనలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలపై జైశంకర్ విమర్శలు గుప్పించారు. "మునుపటి ప్రభుత్వాలు 60 సంవత్సరాలపాటు చేసిన పొరపాట్లను సరిదిద్దలేమని చాలామంది చెప్పారు. కానీ మోదీ ప్రభుత్వం వాటిని సవరిస్తూ ముందుకెళ్తోంది. ఆర్టికల్ 370 రద్దు దానికి ఒక ఉదాహరణ. ఇప్పుడు సింధూ జలాల ఒప్పందాన్ని కూడా పునఃపరిశీలిస్తున్నాం" అని చెప్పారు. ఇంతేకాకుండా, పహల్గాం దాడికి బాధ్యులైన 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' అనే ఉగ్రవాద సంస్థను ఐక్యరాజ్య సమితి (UN) మొదటిసారి తన నివేదికలో ప్రస్తావించిందని కూడా జైశంకర్ పేర్కొన్నారు.

వివరాలు 

సింధూ నదితో పాటు దాని పశ్చిమ ఉపనదులైన జీలం, చీనాబ్‌లపై పాకిస్థాన్‌కు హక్కులు

1960లో భారత్, పాకిస్థాన్‌ల మధ్య సింధూ నదీ జలాలపై ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం,సింధూ నది,దాని పశ్చిమ ఉపనదులు .. జీలం, చీనాబ్.. పై హక్కులు పాకిస్థాన్‌కు దక్కాయి. కానీ ఇటీవల జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో, భారత్ ఈ ఒప్పంద అమలును తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నిర్ణయం పాకిస్థాన్‌కు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది,ఎందుకంటే వారి నీటి అవసరాల మేరకు చాలా భాగం ఈ నదులపై ఆధారపడినదే. సింధూ జలాల ఒప్పందం కింద, పాకిస్థాన్ వ్యవసాయానికి అవసరమైన నీటి సుమారు 80 శాతం అందుతోంది.

వివరాలు 

ఏ దేశంతో కుదుర్చుకున్న ఒప్పందాన్నైనా రద్దు చేసుకొనే హక్కు భారత్‌ కు ఉంటుంది

అంతేకాకుండా, ఆ దేశ GDPలో 25 శాతం వరకు ఈ నదులపై ఆధారపడే వ్యవసాయ రంగం ద్వారా వస్తోంది. ఈ నేపథ్యంలో, భారత్ తీసుకున్నఈ నిర్ణయం పాకిస్థాన్‌పై ఎంత పెద్ద ప్రభావం చూపిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇక అంతర్జాతీయ ఒప్పందాల పరంగా చూస్తే, భారత్‌కు ఏ ఒప్పందాన్ని అయినా పునఃసమీక్షించుకునే లేదా నిలిపివేసే హక్కు ఉంది. అంతర్జాతీయ ఒప్పందాల విషయాలపై ఉన్న వియన్నా ఒప్పందంపై (Vienna Convention) భారత్ సంతకం చేయలేదు. కనుక, పాకిస్థాన్ ఏ కోర్టును ఆశ్రయించినా లేదా అంతర్జాతీయ సంస్థల దృష్టికి తీసుకెళ్లినా, ఇచ్చే తీర్పులు భారత్‌కు వర్తించవు.