LOADING...
Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణ ఖైదీ నెం 15528 ..రూ.1.2 లక్షల జీతం నుంచి రూ.540 జీతానికి..నెలకు జీతం ఇంత తక్కువనా?
ప్రజ్వల్ రేవణ్ణ ఖైదీ నెం 15528 ..రూ.1.2లక్షల జీతం నుంచి రూ.540 జీతానికి..

Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణ ఖైదీ నెం 15528 ..రూ.1.2 లక్షల జీతం నుంచి రూ.540 జీతానికి..నెలకు జీతం ఇంత తక్కువనా?

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 04, 2025
03:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

పనిమనిషిపై పలు మార్లు లైంగిక దాడులకు పాల్పడ్డ కేసులో జేడీఎస్‌ పార్టీకి చెందిన మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణపై ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం తుదితీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఆయనను దోషిగా నిర్ధారిస్తూ కోర్టు జీవిత ఖైదును విధించింది.అంతేకాకుండా రూ.11 లక్షల జరిమానాను కూడా విధించింది. ఈ మొత్తంలో రూ.11.25 లక్షలు బాధిత మహిళకు నష్టపరిహారంగా చెల్లించాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది. ఈ తీర్పుతో ప్రజ్వల్‌ రేవణ్ణను బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు. అక్కడ ఆయన శాశ్వత ఖైదీగా జైలు జీవితం ప్రారంభించారు. 33సంవత్సరాల రేవణ్ణకు ఖైదీ నంబర్‌ 15528 కేటాయించగా, దోషులకు ప్రత్యేకంగా ఉండే బ్యారక్‌కి తరలించారు. జైలు యాజమాన్యం ఆయనకు ప్రత్యేకంగా తెల్లటి యూనిఫాం ఇచ్చింది.

వివరాలు 

హై కోర్టును ఆశ్రయించిన ప్రజ్వల్‌ 

తీర్పు వచ్చిన తర్వాత జైలులో తన తొలి రాత్రి గడిపిన రేవణ్ణ తీవ్ర భావోద్వేగానికి లోనై,కన్నీటితో కాలం గడిపినట్టు సమాచారం. జైలు నిబంధనల ప్రకారం ఆయన కూడా మిగిలిన ఖైదీల మాదిరిగానే రోజుకు 8 గంటలు పని చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో బేకరీ,తోటమాలి లేదా వ్యవసాయంతో సంబంధమైన పనుల్లో ఏదైనా ఒకటి ఆయనకు కేటాయించే అవకాశం ఉంది. ఈ పనులకు ఆయనకు నెలకు రూ.524 వేతనం లభిస్తుంది.న్యాయస్థానం తీర్పును ప్రజ్వల్‌ రేవణ్ణ సవాల్ చేస్తూ హై కోర్టును ఆశ్రయించారు. తాను నిర్దోషినని,తనపై రాజకీయ వేధింపుల కారణంగా కేసు నడిపారనే వాదనతో ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

వివరాలు 

కోర్టులోనే ఆవేదనతో కన్నీటి పర్యంతమైన రేవణ్ణ 

కాగా, ప్రస్తుతం రేవణ్ణపై నాలుగు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. అయితే ఈ తీర్పు వాటిలో మొదటిది మాత్రమే కాగా, మిగతా మూడు కేసులపై విచారణ ఇంకా కొనసాగుతోంది. కర్ణాటకలోని హసన్‌ జిల్లా గన్నికాడ ఫాం హౌస్‌లో పనిచేసే 48 ఏళ్ల మహిళ 2021 నుంచి జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ తనపై పదే పదే లైంగిక దాడికి పాల్పడ్డారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై జరిగిన అఘాయిత్యాన్ని వీడియోలను రికార్డు చేసి,బయట చెబితే చంపేస్తానంటూ బెదిరించారని ఆమె ఆరోపించింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు 2024 మే 31న ప్రజ్వల్ రేవణ్ణను అరెస్ట్ చేశారు. అనంతరం జరిగిన దర్యాప్తులో మొత్తం 123 ఆధారాలు, 2000 పేజీల ఛార్జ్‌షీట్‌ను కోర్టుకు సమర్పించారు.

వివరాలు 

కోర్టులోనే కన్నీరు పెట్టుకున్న రేవణ్ణ 

ఈ కేసులో మొత్తం 23 మంది సాక్షులను విచారించిన కోర్టు 14 నెలల విచారణ అనంతరం ప్రజ్వల్ రేవణ్ణను దోషిగా తేల్చింది. తీర్పు వెలువడిన తర్వాత రేవణ్ణ కోర్టులోనే కన్నీరు పెట్టుకున్నారు. తాను రాజకీయంగా ఎదగాలనే తపనతో తప్పులు జరిగాయని, తక్కువ శిక్ష విధించాలని జడ్జిని వేడుకున్నారు.