LOADING...
Modi3.0: మోడీ 3.0 ప్రభుత్వంలోని క్యాబినెట్ మంత్రుల పూర్తి జాబితా 
Modi3.0: మోడీ 3.0 ప్రభుత్వంలోని క్యాబినెట్ మంత్రుల పూర్తి జాబితా

Modi3.0: మోడీ 3.0 ప్రభుత్వంలోని క్యాబినెట్ మంత్రుల పూర్తి జాబితా 

వ్రాసిన వారు Stalin
Jun 09, 2024
01:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ రోజు నరేంద్ర మోదీ ప్రధానిగా మూడో సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదే కార్యక్రమంలో ఆయనతో పాటు ఎపికి చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడు,పెమ్మసాని చంద్రశేఖర్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరిద్దరితో పాటు కర్ణాటక మాజీ ముఖ్య మంత్రి హెచ్.డి కుమార స్వామి, బిజెపి అస్సాం నేత సర్బందా సోనోవాల్ ను కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అలాగే కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్ ప్రమాణ స్వీకారం చేయబోయే జాబితాలో ఉన్నారు. వీరితో పాటుగా రాజ్ నాధ్ సింగ్, అమిత్ షా, ప్రహ్లాద్ జోషీ, కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు.

details 

ఈ సారి కొత్త ముఖాలు వీరే 

మనోహర్ లాల్ ఖట్టర్, శివరాజ్ సింగ్ చౌహన్, తెలంగాణ నుంచి బండి సంజయ్ , రవినీత్ సింగ్ బిట్టూ ఈ సారి కొత్త ముఖాలు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. మొత్తం మీద కేంద్ర కేబినెట్ లో 52 మందికి ప్రాతినిధ్యం కల్పించనున్నారు .మహారాష్ట్ర నుంచి ఏడుగురికి ఈ సారి అవకాశం కల్పించనున్నారని తెలుస్తోంది. ఈ ఏడాదిలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సాయంత్రం ప్రమాణ స్వీకారం జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీరితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. దీనిని వీక్షించటానికి పలు దేశాధినేతలు ఇప్పటికే దేశ రాజధానికి చేరుకున్నారు.