Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఓనం సందర్భంగా కేరళకు ప్రత్యేక రైళ్లు
రైల్వే ప్రయాణికుల కోసం రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. ఓనం పండగ సందర్భంగా ప్రయాణికుల కోసం భారత రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెల 13, 14 తేదీల్లో ప్రత్యేక రైళ్లు కేరళకు వెళతాయని స్పష్టం చేశారు. ఈ నెల 13న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 07119 నంబర్ ఓనం ప్రత్యేక రైలు సాయంత్రం 5.30 గంటలకు బయల్దేరనుంది. ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, రేణిగుంట, కోయంబత్తూర్, ఎర్నాకులం మీదుగా కొల్లాం చేరుకోనుంది.
ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి
ఈ నెల 14న కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి 07044 నంబర్ ప్రత్యేక రైలు సాయంత్రం 4 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు మహబూబ్‌నగర్, కర్నూలు, గుత్తి, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కోయంబత్తూరు, ఎర్నాకులం, కొట్టాయం, చెంగనూరు మీదుగా కొల్లాం జంక్షన్‌కు వెళనుంది. అక్టోబరు 13 నుంచి నవంబరు 20 వరకు, ఆది, బుధవారాల్లో ప్రయాగ్‌రాజ్-బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ఇక అక్టోబరు 29, నవంబరు 5 తేదీల్లో ఎల్‌టీటీ ముంబై-కరీంనగర్ మధ్య, అక్టోబరు 30, నవంబరు 6 తేదీల్లో కరీంనగర్-ఎల్‌టీటీ ముంబై మధ్య ప్రత్యేక రైళ్లు కూడా నడుపుతున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.