Green Metro buses: హైదరాబాద్‌లో ఆర్టీసీ ప్రయాణికుల కోసం 'గ్రీన్ మెట్రో లగ్జరీ' ఏసీ బస్సులు
ప్రజా రవాణాను మరింత పర్యావరణహితంగా మార్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్‌టీసీ) మరో అడుగు ముందుకు వేసింది. హైదరాబాద్ నగరంలో బుధవారం 'గ్రీన్ మెట్రో లగ్జరీ' ఏసీ బస్సు సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు టీఎస్ఆర్‌టీసీ ప్రకటించింది. ఈ బస్సులు నేటి నుంచే అందుబాటులోకి రానున్నట్లు చెప్పింది. తొలి విడత కింద 25ఎలక్ట్రిక్ బస్సులను బుధవారం గచ్చిబౌలి స్టేడియం సమీపంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రారంభించనున్నారు. మిగిలిన 25 బస్సులు నవంబర్ నాటికి అందుబాటులోకి రానున్నాయని టీఎస్ఆర్టీసీ తెలిపింది. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణతో పాటు ప్రయాణికులకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు ఈ బస్సులను తీసుకొచ్చినట్లు వెల్లడించింది.
'గ్రీన్ మెట్రో లగ్జరీ' బస్సుల ప్రత్యేకతలు ఇవే..
'గ్రీన్ మెట్రో లగ్జరీ' బస్సులు ఆకు పచ్చని రంగులో 12 మీటర్ల పొడవు ఉంటాయి. మొబైల్ ఛార్జింగ్ సౌకర్యం రీడింగ్ ల్యాంప్‌లతో కూడిన 35 సీట్ల సామర్థ్యం ప్రయాణీకుల భద్రత కోసం, టీఎస్ఆర్టీసీ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించబడిన వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ ప్రతి సీటు వద్ద పానిక్ బటన్ సౌకర్యం ఒక్కో బస్సులో రెండు సీసీ కెమెరాలు బస్సు రివర్స్ అయ్యేలా రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా బస్సు ముందు, వెనుక భాగంలో ఎల్‌ఈడీ బోర్డులు అగ్ని ప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు బస్సుల్లో ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టమ్‌ను ఏర్పాటు ప్రయాణికులకు సమాచారాన్ని చేరవేసేందుకు బస్సుల్లో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్