
Upadesh Rana-Rajasingh-Abubakar-Surat Police: రాజాసింగ్ తో సహా ఇద్దరు హిందూ నేతల హత్యకు సుపారి ...నిందితుడి అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
హిందూ సనాతన సంఘ జాతీయ అధ్యక్షుడు ఉపదేశ్ రాణా, తెలంగాణలోని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లను హత్య చేసేందుకు పన్నిన కుట్రను గుజరాత్ పోలీసులు భగ్నం చేశారు.
వీరితోపాటు సుదర్శన్ చానల్ ఎడిటర్ ను కూడా హత్య చేసేందుకు నిందితుడు మౌల్వి సోహెల్ అబూబకర్ తిమోల్ ఓ వ్యక్తికి కోటి రూపాయలు సుపారి ఇచ్చారు.
ఉపదేశ్ రాణా,రాజాసింగ్ లతోపాటు సుదర్శన్ టెలివిజన్ ఛానల్ చీఫ్ ఎడిటర్, బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మలపై మాల్విసోహెల్ అబూబకర్ తిమోల్ బెదిరింపులకు పాల్పడ్డారు.
సూరత్ పోలీసులు రంగాల్లోకి దిగి అబూబకర్ తిమోల్ ను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ మేరకు సూరత్ పోలీస్ కమిషనర్ అనుపమసింగ్ గెహ్లాట్ మీడియాకు వెల్లడించారు.
Surat Police
పాకిస్తాన్ నుంచి ఆయుధాలు కొనుగోలు చేసేందుకు ప్లాన్
నిందితుడు అబూబకర్ ధారాల ఫ్యాక్టరీలో మేనేజర్ గా పని చేస్తున్నాడు.
ముస్లిం చిన్నారులకు ఇస్లాం గురించి ట్యూషన్ చెప్పేవాడు.
ఈ క్రమంలోనే మతోన్మాదం తలకెక్కిన హిందూ సనాతన సంఘ జాతీయ అధ్యక్షుడు ఉపదేశ రాణా హత్యకు ప్రణాళికలు రచించాడు.
అందుకోసం పాకిస్తాన్, నేపాల్ కు చెందిన వ్యక్తులకు కోటి రూపాయలు సుఫారీ అందజేశాడు.
పాకిస్తాన్ నుంచి ఆయుధాలను సైతం కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేశాడని పోలీసులు తెలిపారు.
అబూబకర్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లో ఈ వివరాలు వెల్లడినట్లు తెలిపారు.
నిందితుడు అబూబకార్ పై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు 153 (ఎ), 467, 468, 471, 120 బి కింద కేసులు నమోదు చేశారు .