
Hamoon Cyclone : హమూన్ తుపాన్ కారణంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
ఈ వార్తాకథనం ఏంటి
హమూన్ తుపాన్ తీవ్రరూపం దాల్చింది. దీంతో భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.
మరోవైపు వాయువ్య బంగాళాఖాతంలో హమూన్ తీవ్ర తుపానుగా మారిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది.
ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతోందని, అక్టోబరు 25 మధ్యాహ్నం బంగ్లాదేశ్ ఖేపుపరా, చిట్టగాంగ్ మధ్య తీరాన్ని తాకనుంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండంతో పశ్చిమ బెంగాల్, మణిపూర్, మిజోరం, త్రిపుర, మేఘాలయ, దక్షిణ అస్సాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనుంది.
ఇవాళ మిజోరంలో భారీ వర్షాలు కురుస్తాయని, త్రిపురలో అతిభారీ వర్షాలు కురువనున్నట్లు ఐఎండీ అంచనా వేసింది.
అక్టోబరు 25న ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలతో ముప్పు ఉండగా, అక్టోబర్ 26 నాటికి తీవ్రత తగ్గే అవకాశముందని పేర్కొంది.
detaisl
ఒడిశా తీరం వెంబడి అక్టోబర్ 24 వరకు గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో గాలులు
దక్షిణ అస్సాం, తూర్పు మేఘాలయలో అక్టోబర్ 24-25లల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నట్లు ఐఎండీ అంచనా.
పశ్చిమ బెంగాల్‌లోని కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు సూచించింది.
అక్టోబరు 24న చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనుంది. దీంతో ఒడిశా తీరప్రాంత జిల్లాలు హమూన్ భారీన పడ్డాయని వివరించింది.
ఈ మేరకు ఒడిశా తీరం వెంబడి అక్టోబర్ 24 వరకు గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నట్లు తెలిపింది.
అక్టోబర్ 24 పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్,ఉత్తర మయన్మార్ తీరాల వెంబడి ప్రారంభమయ్యే గాలులు, 25న మిజోరం, త్రిపుర, దక్షిణ అస్సాం, మణిపూర్ లలో గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో వీయనున్నాయి.