హర్యానాలో నాలుగో రోజు కీలక కూల్చివేతలు.. హోటల్ భవనాన్ని పడగొట్టిన బుల్డోజర్
హర్యానాలోని నుహ్ జిల్లాలో నాలుగో రోజూ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అల్లర్లకు కారణంగా నిలిచిన సహారా హోటల్‌ను ఆదివారం బుల్డోజర్లు నేలమట్టం చేశాయి. ఈ బిల్డింగ్ పై నుంచే అల్లరి మూకలు మతపరమైన ఊరేగింపుపై రాళ్ల దాడికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి 20కి.మీ దూరంలోని సర్కార్ భూములు కబ్జాకు గురయ్యాయి. ఈ మేరకు అక్రమ నివాసాలతో పాటు దుకాణాలు, మెడికల్ షాపులను ధ్వంసం చేశారు. గత 3రోజులుగా కూల్చివేతలను కొనసాగుతున్న అధికారులు, దాదాపు 50 నుంచి 60 ఇళ్లను పతనం చేశారు. జులై 31న వీహెచ్‌పీ ఊరేగింపుపై దాడి చేసేందుకు దుండగులు సహారా హోటల్ పైభాగంలోకి ప్రవేశించి రాళ్లు వర్షం కురిపించారు. దీంతో 2500మంది భక్తులు సమీపంలోని గుళ్లోకి వెళ్లి తలదాచుకున్నారు.