తదుపరి వార్తా కథనం

Viveka Murder Case: వివేకా హత్య కేసు దర్యాప్తు కొనసాగించేందుకు మేం సిద్ధం.. సుప్రీంకోర్టుకు తెలిపిన సీబీఐ
వ్రాసిన వారు
Sirish Praharaju
Sep 16, 2025
03:16 pm
ఈ వార్తాకథనం ఏంటి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సుప్రీంకోర్టు సీబీఐ తెలిపింది. పిటిషనర్ కోరిన మేరకు ఇంకా వివరమైన దర్యాప్తు జరపాలని కోరుతూ సీబీఐ అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేయాలని పిటిషనర్ కోరుతున్నారని, అందుకు కోర్టు తగిన ఆదేశాలు ఇస్తే.. దర్యాప్తు కొనసాగించేందుకు సీబీఐ సిద్ధంగా ఉందని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా సమర్పించిన వాదనలు కూడా కోర్టు ముందు వినిపించారు.