'సనాతన' వ్యాఖ్యలపై స్టాలిన్ కుమారుడిని కొట్టడానికి రూ.10 లక్షలు: హిందూ సంస్థ పోస్టర్
సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను ద్రవిడ మున్నేట్ర కజగం(డిఎంకె) నాయకుడు,తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను చెంపదెబ్బ కొడితే 10 లక్షల రూపాయల నగదు బహుమతిని ఇస్తామని ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో హిందూ సంస్థ జన జాగరణ సమితి అనే స్వచ్ఛంద సంస్థప్రకటించడమే కాకుండా పోస్టర్లను కూడా అంటించింది. సనాతన ధర్మం సామాజిక న్యాయ భావనకు విరుద్ధమని,సనాతన ధర్మాన్ని డెంగ్యూ,మలేరియాతో పోల్చారు ఉదయనిధి. అంతేకాదు,సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడమే కాదు నిర్మూలించాలని శనివారం వివాదానికి తెర లేపారు. మత పెద్దలు కూడా ఉదయనిధి వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోలేదు. ఉదయనిధి వ్యాఖ్యలను విమర్శిస్తూ,ఇస్కాన్-కోల్‌కతా వైస్ ప్రెసిడెంట్ రాధారామన్ దాస్ మాట్లాడుతూ"మేము ఈ సమస్యపై ప్రధానమంత్రికి లేఖ రాయబోతున్నాము,ఈ విషయంలో కేంద్రం చట్టపరమైన చర్యలుతీసుకుంటుందని ఆశిస్తున్నామన్నారు.
ఇంతకీ ఉదయనిధి స్టాలిన్ ఏం అన్నారంటే?
ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చారు. ఈ వ్యాఖ్యలు దేశంలో రాజకీయ దుమారాన్ని రేపాయి. అలాగే సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడమే కాకుండా నిర్మూలించాలన్నారు. సనాతన ధర్మం సామాజిక న్యాయం, సమానత్వానికి విరుద్ధమని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. అయితే తన వ్యాఖ్యలు వివాదాస్పమైన నేపథ్యంలో ఉదయనిధి వివరణ ఇచ్చారు. సనాతన ధర్మాన్ని అనుసరించే వ్యక్తులను నిర్మూలించాలని తాను ఎప్పుడూ పిలుపునివ్వలేదని ఉదయనిధి అన్నారు. ద్రావిడ భూమి నుంచి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలనే తమ సంకల్పం కొంచెం కూడా తగ్గదని ఆయన స్పష్టం చేశారు.