Page Loader
Nimisha Priya: ఉరిశిక్ష నుండి  నిమిష ప్రియ  తప్పించుకోగలదా? 'బ్లడ్ మనీ'పై మతగురువుతో రాయబారం
ఉరిశిక్ష నుండి  నిమిషప్రియ  తప్పించుకోగలదా?'బ్లడ్ మనీ'పై మతగురువుతో రాయబారం

Nimisha Priya: ఉరిశిక్ష నుండి  నిమిష ప్రియ  తప్పించుకోగలదా? 'బ్లడ్ మనీ'పై మతగురువుతో రాయబారం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 15, 2025
03:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

యెమెన్ దేశంలో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియకు ప్రస్తుతానికి ఉరిశిక్ష నుండి తాత్కాలిక ఉరట కలిగింది. ఈ శిక్షను ఆపించేందుకు ఆమె కుటుంబానికి ప్రస్తుతం ఉన్న ఏకైక దారి 'బ్లడ్ మనీ' (క్షమాధనం) చెల్లించడమే. ఈ విషయంలో బాధిత కుటుంబంతో ఇప్పటికే సంప్రదింపులు కొనసాగుతున్నాయి. ఈ ప్రయత్నాల్లో భాగంగా తాజాగా భారత్‌కు చెందిన ప్రముఖ ముస్లిం మత గురువు కూడా చొరవ చూపారు. నిమిష ప్రియను ఉరి శిక్ష నుంచి తప్పించేందుకు మతపెద్ద కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ బాధిత కుటుంబంతో చర్చలు జరుపుతున్నట్లు నిమిష తరఫు న్యాయవాది వెల్లడించారు.

వివరాలు 

బ్లడ్ మనీకి అంగీకరించినప్పుడు మాత్రమే ఇది సాధ్యం

''ఇందుకు సంబంధించి ఇండియా గ్రాండ్ ముఫ్తీ అబూబకర్ ముస్లియార్ మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. బాధిత కుటుంబంతోపాటు యెమెన్‌ అధికారులు, అక్కడి మత పెద్దలతో ఆయన మాట్లాడుతున్నారు. బాధిత కుటుంబాన్ని బ్లడ్ మనీకి ఒప్పించే ప్రయత్నాలు మేము తీవ్రంగా చేస్తున్నాం. నిమిష ప్రియను ఉరిశిక్ష నుండి రక్షించే మార్గంగా ప్రస్తుతం ఇదే ఒకే దారి'' అని నిమిష తరఫు న్యాయవాది శుభాష్ చంద్రన్ మీడియాకు తెలియజేశారు. హూతీ గడ్డపై ఉన్న యెమెన్‌లో చట్టాల ప్రకారం నేరం రుజువైన తరువాత కూడా బాధిత కుటుంబం దోషిని క్షమిస్తే శిక్ష నుంచి తప్పించుకోవచ్చు. బ్లడ్ మనీకి అంగీకరించినప్పుడు మాత్రమే ఇది సాధ్యం. ఇదే కారణంగా నిమిష కుటుంబం బాధిత కుటుంబంతో చర్చలు కొనసాగిస్తోంది.

వివరాలు 

నిమిష కుటుంబం దాదాపు ఒక మిలియన్ డాలర్లు చెల్లించేందుకు సిద్ధం 

గత ఏడాది నిమిష ప్రియ తల్లి ప్రేమకుమారి స్వయంగా యెమెన్ వెళ్లి తన పరిచయాలను ఉపయోగించి బ్లడ్ మనీ చెల్లించి కుమార్తెను రక్షించేందుకు ప్రయత్నించారు. నిమిష కుటుంబం దాదాపు ఒక మిలియన్ డాలర్లు (సుమారు 8.6 కోట్లు)చెల్లించేందుకు సిద్ధమని తెలిపినప్పటికీ, బాధిత కుటుంబం ఆ ప్రతిపాదనను స్వీకరించకపోయినట్లు సమాచారం. ఇక మరోవైపు నిమిష ప్రియను రక్షించేందుకు భారత ప్రభుత్వం కూడా తనవంతు ప్రయత్నాలు చేస్తోందని, అయితే ఆ ప్రయత్నాలకు కొన్ని పరిమితులు ఉన్నాయని భారత అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి సోమవారం సుప్రీంకోర్టుకు తెలియజేశారు.

వివరాలు 

భారత్-యెమెన్ మధ్య దౌత్య సంబంధాలు కూడా లేకపోవడం కూడా కారణం

ఉరిశిక్షను ఆపేందుకు భారత్‌కు స్పష్టమైన మార్గాలు లేవని చెప్పారు. బ్లడ్ మనీ చెల్లింపును దౌత్యపరంగా గుర్తించదలచుకోలేదని, అందువల్ల దీనిపై అధికారిక చర్చలు జరపడం అసాధ్యమని స్పష్టం చేశారు. అంతేకాక, భారత్-యెమెన్ మధ్య దౌత్య సంబంధాలు కూడా లేకపోవడం కారణంగా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయిందని తెలిపారు. దీంతో నిమిష ప్రియ ఉరిశిక్ష అమలుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.