LOADING...
Cyber ​​criminals: సుప్రీంకోర్టు పేరుతో భారీ మోసం.. రిటైర్డ్ ఇంజనీర్ నుంచి కోటి 50 లక్షలు కాజేసిన సైబర్ కేటుగాళ్లు! 
సుప్రీంకోర్టు పేరుతో భారీ మోసం.. రిటైర్డ్ ఇంజనీర్ నుంచి కోటి 50 లక్షలు కాజేసిన సైబర్ కేటుగాళ్లు!

Cyber ​​criminals: సుప్రీంకోర్టు పేరుతో భారీ మోసం.. రిటైర్డ్ ఇంజనీర్ నుంచి కోటి 50 లక్షలు కాజేసిన సైబర్ కేటుగాళ్లు! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 10, 2025
03:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

సైబర్ నేరగాళ్లు ఇప్పుడు తమ మోసాలకు కొత్త రూపం ఇచ్చారు. గతంలో సీబీఐ, సీఐడీ, దిల్లీ పోలీసుల పేరుతో భయపెట్టి మోసం చేసిన వాళ్లు, ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టును వాడుకుంటున్నారు. తాజాగా హైదరాబాదులో జరిగిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. సుప్రీంకోర్టు జడ్జి అని నమ్మించి వీడియో కాల్ ద్వారా భారీ స్కాం చేశారు. హైదరాబాద్‌కు చెందిన రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్‌కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. కాల్ చేసిన వారు, "మీ పేరుతో కేసు నమోదైంది. విచారణ సుప్రీంకోర్టులో జరుగుతోందంటూ భయపెట్టారు. ఆపై వీడియో కాల్‌కు కనెక్ట్ కావాలని చెప్పారు.కొన్ని నిమిషాల్లోనే వీడియోలో ఒకరు కనిపించి తాను సుప్రీంకోర్టు జడ్జినని చెప్పారు. ఈ కేసుపై తక్షణమే అరెస్ట్ చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Details

విచారణ తర్వాత డబ్బులు తిరిగొస్తాం

ఆ తరవాత మరో మలుపు. కేసు నివారణకు, ముందుగా కోర్ట్ అకౌంట్‌లో డబ్బులు జమ చేయాలని, విచారణ తర్వాత డబ్బులు తిరిగి వస్తాయని నమ్మించారు. ఈ మాటలు నమ్మిన బాధితుడు కోటి 50 లక్షల రూపాయలు తెలిపిన బ్యాంక్ అకౌంట్‌లో జమ చేశాడు. అయితే డబ్బులు పోగానే వీడియో కాల్ కట్ అయింది. ఆ తర్వాత నుంచి వారికి ఫోన్ చేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. తర్వాత బాధితుడు మోసపోయానని గ్రహించి రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.సుప్రీంకోర్టు పేరుతో నకిలీ కోర్టు, నకిలీ జడ్జిని సృష్టించి భారీగా మోసంచేసిన ఈ ఘటన సైబర్ మోసాలకు కొత్త ఉదాహరణగా నిలుస్తోంది.