Page Loader
Book fair : హైదరాబాద్ బుక్‌ ఫెయిర్‌.. ఈ నెల 19 నుంచి పుస్తకాల పండుగ 
హైదరాబాద్ బుక్‌ ఫెయిర్‌.. ఈ నెల 19 నుంచి పుస్తకాల పండుగ

Book fair : హైదరాబాద్ బుక్‌ ఫెయిర్‌.. ఈ నెల 19 నుంచి పుస్తకాల పండుగ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 12, 2024
12:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లో ప్రముఖ బుక్‌ ఫెయిర్‌ ఈ నెల 19న ప్రారంభమవుతోంది. హైదరాబాద్ బుక్‌ ఫెయిర్ సొసైటీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా డిసెంబర్ 29వ తేదీ వరకు ఈ ప్రదర్శన జరగనుంది. సొసైటీ అధ్యక్షుడు యాకూబ్‌ షేక్, కార్యదర్శి ఆర్‌. శ్రీనివాస్ బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బుక్‌ ఫెయిర్‌ను ప్రారంభించేందుకు ఆహ్వానించినట్టు వారు తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా 210కిపైగా ప్రచురణకర్తలు, పంపిణీదారులు ఈ ప్రదర్శనలో తమ పుస్తకాలను ప్రదర్శించనున్నారు. సుమారుగా 350 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు.

Details

రచయితల కోసం ప్రత్యేకంగా 'రైటర్స్‌ స్టాళ్లు' 

ఈ ఫెయిర్ ప్రాంగణానికి దాశరథి కృష్ణమాచార్య, సభా వేదికకు బోయి విజయభారతి, పుస్తకాల ఆవిష్కరణ వేదికకు తోపుడుబండి సాదిక్‌ పేర్లను పెట్టారు. రచయితల కోసం ప్రత్యేకంగా 'రైటర్స్‌ స్టాళ్లు' కేటాయించారు. పిల్లల కోసం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు, ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నారు. తెలంగాణ రుచులతో ఫుడ్‌ స్టాళ్లు ఏర్పాటు చేసి పాఠకులకు విందు సమర్పిస్తున్నారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ బి. సుదర్శన్‌ రెడ్డి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కోదండరాం, సీనియర్ పాత్రికేయులు కె. రామచంద్రమూర్తి, విశ్రాంత ప్రొఫెసర్ ఆచార్య రమా మేల్కోటే సభ్యులుగా ఏర్పాటు చేశారు.