
హైదరాబాద్-విజయవాడ రెగ్యులర్ సర్వీసుల నిలిపివేత.. గుంటూరు మీదుగా దారి మళ్లింపు
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ రూట్లో రెగ్యులర్ సర్వీసులను టీఎస్ఆర్టీసీ(TSRTC) రద్దు చేసింది.
ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ,పిడుగురాళ్ల,గుంటూరు మీదుగా విజయవాడకు బస్సులను నడిపిస్తామని ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు.
ప్రతి 30 నిమిషాలకు ఓ బస్సు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి బయలుదేరుతుందన్నారు. పూర్తి సమాచారం కోసం 040-69440000, 040-23450033ను సంప్రదించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కీసర టోల్‌గేట్ సమీపంలోని ఐతవరం వద్ద మున్నేరు వాగు భీకరంగా ప్రవహిస్తోంది. ఈ మేరకు ప్రధాన రహదారులపైకి వరద చేరికతో రాకపోకలకు అడ్డంకి ఏర్పడింది.
NH45పై రాత్రి నుంచి విజయవాడ-హైదరాబాద్ మార్గంలో రాకపోకలు స్థంభించాయి. ఇరువైపులా కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి.NH 65పై హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ మీదుగా ఏపీకి మళ్లీస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రెగ్యులర్ సర్వీసులను నిలుపుదల చేసిన TSRTC
ప్రయాణికులకు ముఖ్య గమనిక! హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా కీసర టోల్‌గేట్ సమీపంలోని ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉధృతి నేపథ్యంలో ఆ రహదారిపై రాకపోకలు స్థంభించాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ మార్గంలో రెగ్యులర్ సర్వీసులను…
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) July 28, 2023