Hydra: ప్రభుత్వ ఆస్తుల సంరక్షణకు హైడ్రాకు హైపవర్
హైదరాబాద్‌లోని హైడ్రా (హైదరాబాద్ విపత్తు స్పందన, ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ ఏజెన్సీ)కి విస్తృతాధికారాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంగళవారం ఆమోదం తెలిపారు. ఈ ఆర్డినెన్స్ వల్ల హైడ్రా నిర్వహించే అన్ని చర్యలకు చట్టబద్ధత లభించనుంది. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టి ఆమోదం లభించనుంది. హైడ్రాకు జీహెచ్ఎంసీ చట్టం-1955లోని సెక్షన్ 374బీ ప్రకారం ఆక్రమణలను పరిశీలించి, తొలగించే అధికారం కూడా లభించింది. ఇక అనధికారిక ప్రకటనలపై జరిమానాలు విధించే అధికారం కూడా హైడ్రాకు బదిలీ చేశారు.
అక్రమణపై స్వతహాగా నిర్ణయాలు తీసుకొనే అవకాశం
పురపాలక చట్టం-2019లోని కమిషనర్, జోనల్ కమిషనర్‌కు ఉన్న అధికారాలు కూడా హైడ్రాకు ఇచ్చారు. హైడ్రా పరిధిలోని విభాగాలు విపత్తుల సమయంలో భూఆక్రమణల తొలగింపులో నిరంతరం పనిచేసేలా విస్తృతమైన అధికారాలను కలిగి ఉంటాయి. ఆక్రమణలపై స్వతహాగా చర్యలు తీసుకోవడంలో హైడ్రాకు పూర్తి స్వాతంత్య్రం లభించనుంది. తద్వారా నిర్మాణాలపైన సత్వర నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.