
Hydraa Toll Free Number: వరదలు, అగ్ని ప్రమాదాల్లో అత్యవసర సేవల కోసం హైడ్రా.. టోల్ ఫ్రీ నెంబర్ ఇదే
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ నగరంలో ప్రజా భద్రత, ఆస్తుల రక్షణ కోసం హెచ్‌డిఆర్‌ఏ (హైడ్రా) టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తీసుకురాబడింది. ప్రజలు ఏవైనా ఫిర్యాదులు చేయాలంటే 1070 నంబర్‌కు కాల్ చేయవచ్చని హెచ్‌డిఆర్‌ఏ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ప్రత్యేకంగా చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూములు, ప్రజావాసరాలకు ఉద్దేశించిన స్థలాలపై అక్రమ కబ్జా సమస్యలైతే వెంటనే 1070కు కాల్ చేసి కంప్లైంట్ చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. అలాగే, ప్రకృతి వైపరీత్యాలు చోటుచేసుకుంటే చెట్లు కూలిపోవడం, వరద ముంచెత్తడం, అగ్ని ప్రమాదాలు మొదలైన పరిస్థితులు సంభవించినప్పుడు కూడా ఇదే నంబర్ ద్వారా హెల్ప్ పొందవచ్చని చెప్పారు.
Details
పిర్యాదులు వాట్సాప్ ద్వారా పంపొచ్చు
ఓఆర్‌ఆర్ పరిధిలో ప్రభుత్వ, ప్రజా ఆస్తుల రక్షణకు 8712406899 నంబర్ ద్వారా సమాచారం ఇవ్వవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఫిర్యాదులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను వాట్సాప్ ద్వారా కూడా పంపవచ్చని సూచించారు. ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు, భారీ వర్షాలు పడటం వల్ల కాలనీలు, రహదారులు నీటమునిగితే, అగ్ని ప్రమాదం సంభవించిన సందర్భాల్లో వెంటనే 8712406901 లేదా 9000113667 నంబర్లకు ఫోన్ చేయవచ్చని అధికారులు వెల్లడించారు.