PM Modi: ఢిల్లీ-బెంగాల్ సీనియర్ సిటిజన్లకు ప్రధాని క్షమాపణలు
ఆయుర్వేదానికి, ఆరోగ్యానికి దేవుడైన ధన్వంతరి జయంతి (ధన్‌తేరస్) సందర్బంగా ప్రధాని నరేంద్ర మోదీ రూ. 12,850 కోట్ల వ్యయంతో విస్తృత వైద్య పథకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా, 70 ఏళ్లు,అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని విస్తరించే నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం ద్వారా, వృద్ధులు ఏటా రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స పొందవచ్చు. కానీ, రాజకీయ కారణాల వల్ల దిల్లీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చేయడంలో విఫలమయ్యాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
రాజకీయ ప్రయోజనాల కారణంగా ఈ పథకాన్ని అమలు చేయడం లేదు: మోదీ
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, "ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌లో 70 ఏళ్ల పైబడిన వృద్ధులకు నేను సేవ చేయలేకపోతున్నందుకు క్షమాపణలు కోరుతున్నాను. మీ బాధ నాకు తెలుసు, కానీ మీకు సహాయం చేయలేక పోతున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాజకీయ ప్రయోజనాల కారణంగా ఈ పథకాన్ని అమలు చేయడం లేదు" అన్నారు. బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి, ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం వలన తమ ప్రజలకు ఆరోగ్యాన్ని అందించలేక పోతున్నట్లు ప్రధాని మోడీ వెల్లడించారు.
సేవలు అందకపోవడంపై విచారం
ఈ పథకంతో ఆసుపత్రుల్లో ప్రజలకు ఏటా రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందించబడుతుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే,వారికి 'ఆయుష్మాన్ వయ వందన' కార్డు కూడా ఇవ్వబడుతుంది. అయితే, సంబంధిత రాష్ట్రాల ప్రజలకు ఈ సేవలు అందకపోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు.