
PM Modi: మరణించిన నా తల్లిని అవమానించారు.. ఆర్జేడీ- కాంగ్రెస్‌ల అభ్యంతరకర వ్యాఖ్యలపై మోదీ ఆవేదన
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహించిన 'ఓటర్ అధికార్ యాత్ర' సందర్భంలో,కొందరు వ్యక్తులు ప్రధాని నరేంద్ర మోదీ తల్లిని ఉద్దేశించి అవమానకర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో భాజపా ఇటీవల తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆర్జేడీ- కాంగ్రెస్ వేదికలపై చనిపోయిన తల్లిని దూషించేలా మాట్లాడారని,ఇది తనకు వ్యక్తిగతంగా మాత్రమే కాదు,దేశంలోని ప్రతి తల్లి, సోదరి కోసం కలిగిన అవమానం అని ఆయన తెలిపారు. ప్రధాని మోదీ బిహార్ రాష్ట్ర జీవననిధి శాఖ సహాయ సంఘ్ లిమిటెడ్‌ను వర్చువల్‌గా ప్రారంభించి, దాదాపు 20లక్షల మహిళలతో కూడిన కాన్ఫరెన్స్‌లో ప్రసంగించారు. కోన్నిరోజుల క్రితం బిహార్‌లో ఆర్జేడీ- కాంగ్రెస్‌ల వేదికపై తన తల్లిని ఉద్దేశిస్తూ కొందరు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారన్నారు.
వివరాలు
దివంగత తల్లి హీరాబెన్ మోదీ కష్టాలు, త్యాగాలను గుర్తు చేసుకున్న ప్రధాని
ఇది కేవలం తన తల్లికి మాత్రమే కాక, దేశంలోని ప్రతి తల్లి, సోదరి కోసం జరిగిన అవమానం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బిహార్ ప్రజలు కూడా తనలాగే ఈ విషయంపై బాధపడుతున్నారని తెలిపారు. మోదీ తన దివంగత తల్లి హీరాబెన్ మోదీ కష్టాలు, త్యాగాలను గుర్తు చేసుకున్నారు. తల్లి అనారోగ్యంతో ఉన్నప్పటికీ మోదీని, ఆయన సోదరులను పెంచడానికి పనిచేస్తూనే ఉండేదన్నారు. దుస్తులు కొనేందుకు ప్రతి పైసా ఆదా చేసేది, దేశంలో ఇలాంటి తల్లులు కోట్లాది మంది ఉన్నారని, దేవతల కంటే తల్లి స్థానం గొప్పదని ఆయన చెప్పారు.
వివరాలు
రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి: అమిత్ షా
ఈసందర్భంగా రాజ కుటుంబాల్లో పుట్టిన యువరాజులు..పేద తల్లి బాధలు,ఆమె కుమారుడు చేసే పోరాటాలను అర్థం చేసుకోలేరంటూ రాహుల్,ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌లను ఉద్దేశిస్తూ విమర్శించారు. వారు గోల్డెన్ స్పూన్‌లో పుట్టి,అధికారాన్ని తమ కుటుంబాలకు మాత్రమే దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజలు పేద తల్లి కుమారుడిని ఆశీర్వదించి ప్రధానిగా ఎంచుకున్నారని,దీన్ని నామ్‌దార్లు సహించలేకపోతున్నారని మోదీ మండిపడ్డారు. ఇదే సమయంలో,బిహార్‌లో ఇటీవల కాంగ్రెస్ నిర్వహించిన ఒక సభలో,కొందరు కార్యకర్తలు మోదీ, ఆయన తల్లిని దూషిస్తూ వ్యాఖ్యలు చేశారు అని భాజపా ఆరోపించింది. ఈ విషయానికి సంబంధించి పట్నాలోని కొత్వాలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి,ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ వ్యాఖ్యలపై స్పందించి,రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.