Page Loader
Rain Alert: ఏపీ,తెలంగాణలో వచ్చే 3 రోజులు వర్షాలు.. ఈ జిల్లాలకు అలెర్ట్

Rain Alert: ఏపీ,తెలంగాణలో వచ్చే 3 రోజులు వర్షాలు.. ఈ జిల్లాలకు అలెర్ట్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 22, 2025
08:47 am

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణ ఒడిశా ప్రాంతం, దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. 13 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుండి ఉత్తర మధ్య కర్ణాటక మీదుగా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరం వరకు సగటు సముద్ర మట్టానికి 5.8 కిమీ ఎత్తులో ద్రోణి ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే మూడురోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక అమరావతి వాతావరణ కేంద్రం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మరోసారి భారీ వర్ష సూచన జారీ చేసింది. అల్లూరి సీతారామరాజు,తూర్పు గోదావరి,పశ్చిమ గోదావరి,ఏలూరు,కృష్ణా,ఎన్టీఆర్,గుంటూరు,బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.

వివరాలు 

తెలంగాణలోని 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

మిగిలిన జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇదిలా ఉంటే, తెలంగాణ రాష్ట్రానికి కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం భారీ వర్ష సూచన చేసింది. ఈ రోజు (మంగళవారం)తెలంగాణలోని 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా,మరో 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఖమ్మం,నల్గొండ,సూర్యాపేట,యాదాద్రి భువనగిరి,రంగారెడ్డి,హైదరాబాద్,మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్,సంగారెడ్డి,మెదక్,మహబూబ్ నగర్,నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే తెలంగాణలోని అన్నిజిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు,మెరుపులతో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాకుండా, కొన్ని ప్రాంతాల్లో గంటకు 30నుంచి 40కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.