IMD: ఏపీ,తెలంగాణకి భారీ వర్ష సూచన.. హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ
నైరుతి రుతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు మరింత పురోగమిస్తున్నాయని భారత వాతావరణ విభాగం (IMD) సోమవారం తెలిపింది. రుతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, దక్షిణ గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు, తెలంగాణలోకి ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. హైదరాబాద్‌లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం, ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. జూన్ 17 వరకు కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రాగల 72 గంటల్లో అతి తీవ్రమైన వర్షాలు
ఆంధ్రప్రదేశ్‌లో రాగల 24 గంటల్లో రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, జూన్ 14 వరకు ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తా ఏపీలో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. రాగల 72 గంటల్లో అతి తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో తీవ్ర వరదలు సంభవించవచ్చు. అలాగే,రాబోయే 48 గంటల్లో కొంకణ్ & గోవా, మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడా, కోస్టల్ & నార్త్ ఇంటీరియర్ కర్ణాటకలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది. రుతుపవనాల ప్రారంభంతో సోమవారం ఉదయం ముగిసిన 24 గంటల్లో ముంబైలో వాతావరణంలో గణనీయమైన మార్పు వచ్చింది.
అరుణాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు
ఈశాన్య ప్రాంతంలో, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం & మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం & త్రిపుర, సబ్-హిమాలయన్ పశ్చిమ బెంగాల్ & సిక్కిం చాలా విస్తృతంగా వర్షాలు కురుస్తాయి. ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్ & సిక్కిం, అస్సాం,మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్‌లలో జూన్ 10 నుండి 14 వరకు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. జూన్ 13, 14 తేదీల్లో నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. జూన్ 11 నుండి 14 వరకు అస్సాం, మేఘాలయ, సబ్-హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కింలలో జూన్ 13, 14 తేదీల్లో అరుణాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. .