
Pakistani official: పాకిస్తాన్‌కి షాక్ ఇచ్చిన భారత్.. హైకమిషన్ ఉద్యోగిని బహిష్కరించిన ఇండియా..కారణం ఏంటంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
న్యూదిల్లీలో ఉన్న పాకిస్థాన్ హైకమిషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఒక పాకిస్తాన్ అధికారిని భారత్ బహిష్కరిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
హైకమిషన్ కార్యాలయం వెలుపల అతడు పాల్గొన్నఅభ్యంతరకర కార్యకలాపాల నేపథ్యంలో,భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA)విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఆయా కార్యకలాపాలు భారత్‌లో అతని అధికారిక హోదాకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది.
పర్సనా నాన్ గ్రాటా (Persona Non Grata)గా ప్రకటించబడిన ఆ అధికారి 24 గంటల వ్యవధిలోగా భారతదేశాన్ని విడిచిపెట్టాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఈమేరకు నేడు పాకిస్తాన్ హైకమిషన్‌కి చెందిన ఛార్జ్ డి అఫైర్స్‌కు అధికారికంగా సమాచారాన్ని అందజేశారు.
భారత్-పాకిస్తాన్ మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో,ఈచర్య మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
భారత్‌ను వదిలి వెళ్లిపోవాలని పాక్ అధికారికి నోటీసు
STORY | India expels Pakistani official at Pak mission
— Press Trust of India (@PTI_News) May 13, 2025
READ: https://t.co/yhrIjtmCjk pic.twitter.com/bIgDD5iyFo