Page Loader
Covid 19: దేశంలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా.. 5,364 కొవిడ్‌ యాక్టివ్‌ కేసులు.. 55 మరణాలు
దేశంలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా.. 5,364 కొవిడ్‌ యాక్టివ్‌ కేసులు.. 55 మరణాలు

Covid 19: దేశంలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా.. 5,364 కొవిడ్‌ యాక్టివ్‌ కేసులు.. 55 మరణాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 06, 2025
11:55 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) ఉధృతి రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా దేశంలో ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య ఐదు వేలు దాటినట్లు వెల్లడైంది. ఇప్పటి వరకు కొవిడ్‌ కారణంగా మొత్తం 55 మంది ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ జారీ చేసిన తాజా గణాంకాల ప్రకారం,జూన్ 6వ తేదీ ఉదయం 8 గంటల వరకూ దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసుల సంఖ్య 5,364కి చేరుకుంది.

వివరాలు 

కేరళ రాష్ట్రంలో అత్యధికంగా 1,679 యాక్టివ్‌ కేసులు

గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 498 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా,ఈ సమయంలో నలుగురు మరణించారు. ఈ మరణాల్లో ఇద్దరు బాధితులు కేరళకు చెందినవారవుతే, మిగతా ఇద్దరు పంజాబ్‌, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారు. దేశంలో కేరళ రాష్ట్రంలో అత్యధికంగా 1,679 యాక్టివ్‌ కేసులు ఉండగా, ఆ తర్వాత గుజరాత్‌, పశ్చిమ బెంగాల్‌, ఢిల్లీ రాష్ట్రాలు వరుసగా ఉన్నాయని అధికారులు తెలిపారు.