Page Loader
వచ్చే ఎన్నికల్లో దేశానికి నాయకత్వం వహించేది రాహుల్ గాంధీ: కాంగ్రెస్ 
వచ్చే ఎన్నికల్లో దేశానికి నాయకత్వం వహించేది రాహుల్ గాంధీ: కాంగ్రెస్

వచ్చే ఎన్నికల్లో దేశానికి నాయకత్వం వహించేది రాహుల్ గాంధీ: కాంగ్రెస్ 

వ్రాసిన వారు Stalin
Oct 07, 2023
06:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ దేశానికి నాయకత్వం వహిస్తారని కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. 'భారత్‌ జోడో యాత్ర' తర్వాత రాహుల్‌ గాంధీకి ఉన్న ఆదరణ చూసి బీజేపీ భయపడుతోందని ఆయన అన్నారు. ప్రధాని మోదీ , రాహుల్‌పై బీజేపీ- కాంగ్రెస్ మధ్య పోస్టర్ల వార్ నడుస్తున్న నేపథ్యంలో శివకుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని నవయుగ రావణుడితో పోలుస్తూ.. బీజేపీ ఒక పోస్టర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. భారత్‌ను నాశనం చేయడమే అతని లక్ష్యం అని బీజేపీ ట్విట్టర్‌లో పేర్కొంది. ఈ పోస్టర్‌పై ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు నిరసనలు చేపట్టింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మీడియాతో మాట్లాడుతున్న శివకుమార్