LOADING...
Predator Drones: అమెరికాతో భారత్ కీలక డీల్.. దాదాపు $4 బిలియన్ల మెగా ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలు
అమెరికాతో భారత్ కీలక డీల్

Predator Drones: అమెరికాతో భారత్ కీలక డీల్.. దాదాపు $4 బిలియన్ల మెగా ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 15, 2024
02:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత సరిహద్దుల్లో చైనా, పాకిస్థాన్‌ల నుంచి నిరంతరం ఉన్న ముప్పు దృష్ట్యా, సైన్యాన్ని మరింత బలపరిచే దిశగా భారత్‌ కీలకమైన ఒప్పందం చేసుకుంది. అమెరికా నుంచి అత్యాధునిక ప్రిడేటర్‌ (Predator) డ్రోన్ల కొనుగోలుకు మంగళవారం సంతకం చేసింది. ఈ ఒప్పందం కింద భారత్ మొత్తం 31 ఎంక్యూ9బీ డ్రోన్లను కొనుగోలు చేస్తోంది. ఈ డ్రోన్లకు ప్రత్యేకమైన క్షిపణులు, లేజర్‌ గైడెడ్‌ బాంబులు కూడా జనరల్‌ అటామిక్స్‌ సంస్థ ద్వారా సమకూర్చబడతాయి. ఈ 31 డ్రోన్లలో 15 నౌకాదళానికి, 8 సైన్యానికి, మిగిలినవి వాయుసేనకు కేటాయించనున్నారు. ఈ ఒప్పందం విలువ సుమారు 3.5 బిలియన్‌ డాలర్లుగా భావిస్తున్నారు.

వివరాలు 

ఈ డ్రోన్లు 40 గంటలకు పైగా గాల్లో విహరించగలవు

రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆగస్టులో అమెరికా పర్యటనలో ఈ డ్రోన్ల సామర్థ్యాలను పరిశీలించారు. ఇప్పటికే పశ్చిమాసియా, అఫ్గాన్‌ సంక్షోభాల్లో ఈ డ్రోన్లను విస్తృతంగా వినియోగించారు. చైనాతో వాస్తవాధీన రేఖ వెంబడి ఈ డ్రోన్లు కీలకమని భారత్ భావిస్తోంది. ఈ డ్రోన్లు 40 గంటలకు పైగా గాల్లో విహరించగలవు, అంతే కాకుండా నాలుగు హెల్‌ఫైర్‌ క్షిపణులు, 450 కిలోల బాంబులను మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉంటాయి. భారత్‌ ఇప్పటికే సీగార్డియన్‌ డ్రోన్లను వినియోగిస్తోంది, వీటిని కూడా జనరల్‌ అటామిక్స్‌ సంస్థ నుంచి లీజ్‌పై తీసుకుంది. ఈ ఏడాది జనవరిలో లీజు ముగిసినప్పటికీ, మన నౌకాదళం దీన్ని నాలుగేళ్ల పాటు పొడిగించింది.