Narendra Modi: భారత్‌కు త్వరలో బుల్లెట్ రైలు.. ప్రధాని మోదీ కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ చర్లపల్లి రైల్వే టర్మినల్‌ను వర్చువల్‌గా ఇవాళ ప్రారంభించారు.
దిల్లీ నుంచి ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొనగా, హైదరాబాద్ నుండి సీఎం రేవంత్ రెడ్డి కూడా వర్చువల్‌గా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా మెట్రో సేవలు 1000 కిలోమీటర్ల మైలురాయిని దాటాయని, కోట్లాది ప్రజలకు మెట్రో సేవలు అందించామన్నారు.
అలాగే ప్రతి రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి జరుగుతోందని, దేశంలో కనెక్టివిటీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.
ప్రధాని మోదీ తన ప్రసంగంలో భారత్‌కు బుల్లెట్ రైలు త్వరలో అందుబాటులోకి వస్తుందన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంతో రైల్వే అభివృద్ధి నాలుగు విభాగాల్లో జరుగుతుందన్నారు.
Details
వందే భారత్ రైళ్ల ద్వారా కోట్ల మంది గమ్యస్థానాలకు
ఈ విభాగాలు మౌలిక వసతులు, ప్రయాణికుల సదుపాయాలు, మారుమూల ప్రాంతాలకు కనెక్టివిటీ, ఉపాధి కల్పన అని ఆయన తెలిపారు.
భారత రైల్వేకు బెంచ్‌మార్క్ సృష్టిస్తున్నామని, కోట్లు సంఖ్యలో ప్రజలు వందే భారత్ రైళ్ల ద్వారా గమ్యం చేరుకుంటున్నారని వెల్లడించారు.
మోదీ చర్లపల్లి రైల్వే టర్మినల్‌ను సోలార్ స్టేషన్‌గా అభివృద్ధి చేసినట్లు చెప్పారు.
ఇది ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంగా ఉందని, తెలంగాణ అభివృద్ధిలో చర్లపల్లి రైల్వే టర్మినల్ కీలకంగా మారనుందని చెప్పారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా ఇలాంటి స్టేషన్లు అవసరమని అన్నారు.