
Jammu Kashmir: పూంచ్‌లో పాకిస్తాన్ లైవ్ షెల్..ధ్వంసం చేసిన భారత ఆర్మీ
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దు గ్రామాల్లో పాకిస్తాన్ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో, ఓ లైవ్ షెల్ బయటపడటం తీవ్ర కలకలం రేపింది.
ఈ షెల్‌ను భారత ఆర్మీ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి విజయవంతంగా నిర్వీర్యం చేశారు.
ఇటీవల పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత బలగాలు చేపట్టిన "ఆపరేషన్ సిందూర్" విజయవంతంగా సాగింది.
ఈ కఠిన ప్రతిస్పందనను పాకిస్థాన్ జీర్ణించుకోలేకపోయింది. అందుకే, జమ్మూ కశ్మీర్ సరిహద్దు గ్రామాలపై దాడులకు తెగబడింది.
పాక్ దాడుల కారణంగా అక్కడి ప్రజలు ఆందోళనకు గురయ్యారు. పరిస్థితిని గమనించిన భారత సైన్యం, తమ పని మొదలుపెట్టి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
వివరాలు
పూంఛ్ జిల్లాలోని రోడ్డుపక్కన ఒక లైవ్ షెల్
తర్వాత కాల్పుల విరమణ జరిగిపోయిన నేపథ్యంలో, సరిహద్దు గ్రామాల ప్రజలు మళ్లీ తమ ఇళ్లకు తిరిగి వచ్చారు.
అయితే మంగళవారం రోజు, పూంఛ్ జిల్లాలోని రోడ్డుపక్కన ఒక లైవ్ షెల్ పడివుండటం స్థానికులు గమనించారు.
వారు వెంటనే ఆ విషయాన్ని ఆర్మీ అధికారులకు తెలియజేశారు. సమాచారం అందిన వెంటనే భద్రతా దళాలు రంగంలోకి దిగాయి.
అపాయాన్ని గుర్తించిన ఆర్మీ బాంబ్ స్క్వాడ్ దాన్ని నిర్వీర్యం చేసి ధ్వంసం చేశారు.
పాకిస్తాన్ చర్యల ప్రభావం పూంఛ్ ప్రాంత ప్రజలపై తీవ్రమైంది. ఇప్పటివరకు అక్కడ 25 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. పాక్ బార్బరిక్ చర్యల నేపథ్యంలో, భద్రతా చర్యలు మరింతగా పెంచారు.