భారత్-కెనడా సంబంధాలను దెబ్బతీసేందుకు నిజ్జర్ హత్యకు పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ పథకం
పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్‌ఐ)కెనడాలో ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను హతమార్చడానికి భారత్, కెనడాల మధ్య సంబంధాలను దెబ్బతీసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు ఉటంకిస్తూ పలు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. నిజ్జర్‌ను చంపడానికి ISI నేరస్థులను నియమించిందని, గత రెండేళ్లలో కెనడాకు వచ్చిన గ్యాంగ్‌స్టర్‌లకు పూర్తిగా మద్దతు ఇవ్వమని అతనిపై ఒత్తిడి తెచ్చిందని కూడా వర్గాలు తెలిపాయి. అయితే, నిజ్జర్ మొగ్గు మాజీ ఖలిస్తానీ నాయకుల వైపే ఉంది. అంతేకాకుండా స్థానికంగా పాపులారిటీ పెంచుకున్న నిజ్జర్ .. డ్రగ్స్ అక్రమ దందాను కూడా నియంత్రిస్తున్నట్లు సమాచారం.
నిజ్జర్ హత్యకు ఐఎస్‌ఐ కుట్ర
ఈ నేపథ్యంలోనే అతడిపై కోపం పెంచుకున్న ఐఎస్‌ఐ.. నిజ్జర్‌ను హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. నిజ్జర్ హత్య తరువాత, ISI ఇప్పుడు అతని స్థానంలో కెనడాలో ఖలిస్తాన్ అనుకూల ఉగ్రవాదులను సమీకరించడానికి సిద్ధమవుతోందని కూడా వర్గాలు తెలిపాయి. కెనడాలో నిజ్జర్ ఉంటున్న ప్రాంతంలో ఐఎస్‌ఐ మాజీ అధికారులు,మేజర్ జనరల్స్ నుంచి హవల్దార్ స్థాయి అధికారులు నివసిస్తున్నట్లు తెలిసింది. వీరి ద్వారానే నిజ్జర్ కదలికలను తెలుసుకున్నట్లు సమాచారం. బ్రిటీష్ కొలంబియాలో జూన్ 18న తన దేశ గడ్డపై హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇటీవల ఆరోపించిన తర్వాత దౌత్యపరమైన వివాదం చెలరేగింది.