
INS Tamal: ఇండియన్ నేవీలోకి నేడు INS తమాల్.. ఈ యుద్ధనౌక ప్రత్యేకతలు ఏంటంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
భారత నౌకాదళానికి నేడు మరో శక్తివంతమైన ఆయుధం చేరనుంది. రక్షణ ఒప్పందం కింద రష్యా భారత్‌కు అందజేయనున్న యుద్ధ నౌక 'INS తమాల్'ను ఈ రోజు అధికారికంగా నౌకాదళంలోకి చేర్చనున్నారు. రష్యాలోని కాలినిన్‌గ్రాడ్ నౌకాశ్రయంలో ఈ యుద్ధనౌకను భారత్‌కు అప్పగించే కార్యక్రమం జరగనుండగా, ఇందులో కమాండింగ్ చీఫ్ సంజయ్ ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు.
వివరాలు
నౌక ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి:
పొడవు, బరువు: INS తమాల్ 125 మీటర్ల పొడవుతో కూడి, దాదాపు 3,900 టన్నుల బరువు కలిగిన అత్యాధునిక యుద్ధనౌకగా రూపొందించబడింది. సముద్రంపై కార్యకలాపాలు: ఈ నౌక అరేబియా సముద్రం, పశ్చిమ హిందూ మహాసముద్రం ప్రాంతాల్లో భారత నౌకాదళ కార్యకలాపాలను పర్యవేక్షించనుంది. కరాచీకి సమీపంలో: శత్రుదేశం పాకిస్థాన్‌తో సరిహద్దులోనూ సముద్ర మార్గంలోనూ వ్యూహాత్మకంగా కరాచీకి సమీపంలో ఈ నౌకను మోహరించనున్నారు. ఇది భద్రత పరంగా కీలకంగా మారనుంది. లక్ష్య ఛేదన సామర్థ్యం: భూమిపై గల లక్ష్యాలు, సముద్రంపై ఉన్న లక్ష్యాలను సమర్థవంతంగా ఛేదించగల శక్తివంతమైన ఆయుధ వ్యవస్థలు ఇందులో ఉన్నాయి.
వివరాలు
నౌక ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి:
ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ: ఇందులో 'SHTIL' అనే వర్టికల్ లాంచ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అమర్చబడి ఉంది. దీనిలో షార్ట్ రేంజ్ ఎయిర్-టు-ఎయిర్ మిస్సైల్స్, మీడియం రేంజ్ సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్స్ ఉన్నాయి. ఇవి గగనతల ముప్పుల నుంచి నౌకను రక్షించగలుగుతాయి. క్షిపణుల సామర్థ్యం: ఈ నౌకలో క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణుల లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉంది. దీనితో పాటు హెలికాప్టర్ల సహాయంతో కూడా బలమైన సముద్ర రక్షణ వ్యవస్థను అందిస్తుంది. నావల్ గన్ వ్యవస్థ: ఈ నౌక 'A-190-01' మోడల్‌కి చెందిన 100 మిల్లీమీటర్ల నావల్ ఫిరంగితో సిద్ధంగా ఉంది. ఇది శత్రు లక్ష్యాలను ధ్వంసం చేసే విషయంలో అత్యుత్తమమైన సామర్థ్యం కలిగి ఉంది.
వివరాలు
నౌక ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి:
మునుపటి క్షిపణుల కంటే మెరుగ్గా: ఇప్పటివరకు భారత నౌకాదళంలో ఉపయోగిస్తున్న క్రూయిజ్ క్షిపణుల కంటే INS తమాల్ మరింత సమర్థవంతంగా లక్ష్యాలను చేధించగలదు. మొత్తంగా, INS తమాల్ నౌకాదళానికి మరింత బలం చేకూర్చనుండగా, శత్రుదేశాల నుండి వచ్చే ముప్పులను ముందుగానే తిప్పికొట్టేలా వ్యవస్థాపించబడింది. భారత సముద్ర రక్షణ వ్యూహంలో ఇది కీలకంగా మారనుంది.