Page Loader
Indian student : కెనడాలో గాల్లో ఢీ కొన్న విమానాలు.. భారత్‌కు చెందిన విద్యార్థి మృతి
కెనడాలో గాల్లో ఢీ కొన్న విమానాలు.. భారత్‌కు చెందిన విద్యార్థి మృతి

Indian student : కెనడాలో గాల్లో ఢీ కొన్న విమానాలు.. భారత్‌కు చెందిన విద్యార్థి మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 10, 2025
04:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

కెనడాలోని మానిటోబాలో దుర్ఘటన చోటుచేసుకుంది. శిక్షణ సమయంలో రెండు సింగిల్‌ ఇంజిన్‌ విమానాలు గాల్లో ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువ పైలట్లు దుర్మరణం చెందారు. మృతుల్లో ఒకరు భారత సంతతికి చెందినవారని, అతడు కేరళ రాష్ట్రానికి చెందిన శ్రీహరి సుకేశ్ (వయసు 23) అని టొరంటోలోని భారత రాయబార కార్యాలయం అధికారికంగా తెలిపింది. మరోవైపు మృతులలోని మరొకరు 20 ఏళ్ల కెనడియన్‌ పౌరుడు సవన్నా మే రోయెస్‌గా గుర్తించబడ్డారు. ఈ సంఘటనపై పలు మీడియా సంస్థలు నివేదికలు వెలువరించాయి. కేరళకు చెందిన ఓ ప్రముఖ వార్తా సంస్థ ప్రకారం.. శ్రీహరి సుకేశ్‌ కొచ్చి నగరంలోని త్రిప్పునితుర ప్రాంతానికి చెందినవాడు.

Details

ప్రాక్టీస్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు నిర్ధారణ

అతడు హార్వ్స్‌ ఎయిర్‌ పైలట్‌ శిక్షణ పాఠశాలలో (Harvs Air pilot training school) శిక్షణ పొందుతున్నాడు. ప్రమాదంపై శిక్షణ పాఠశాల అధ్యక్షుడు ఆడమ్‌ పెన్నర్‌ స్పందించారు. మంగళవారం తెల్లవారుజామున టేకాఫ్‌, ల్యాండింగ్‌లను ప్రాక్టీస్‌ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. అదే సమయంలో రెండు విమానాలు ల్యాండ్‌ కావడానికి ప్రయత్నించగా గాల్లో ఢీ కొన్నాయని వివరించారు. ఈ విషాద ఘటనతో శిక్షణ సంస్థలో విషాదచాయలు అలుముకున్నాయి. పైలట్‌ శిక్షణలో ఉండగానే ఇలాంటి ప్రమాదం జరగడం వల్ల సంబంధిత అధికార యంత్రాంగం దర్యాప్తు ప్రారంభించింది.