
Airlines Alert: భారీ వర్షం కారణంగా గోవాకు విమానాలు ఆలస్యంగా నడుస్తాయి: ఇండిగో
ఈ వార్తాకథనం ఏంటి
అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో దేశవ్యాప్తంగా పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి.
ముఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వర్షాల తీవ్రత కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులకు ప్రయాణం కష్టంగా మారింది.
ఇక రైళ్ల రాకపోకలపై కూడా వర్షాలు ప్రభావం చూపుతున్నాయి. పలుచోట్ల ట్రైన్లు ఆలస్యంగా నడవడమే కాకుండా, కొన్నిచోట్ల రద్దు అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఈ క్రమంలో విమానయాన సంస్థలూ అప్రమత్తమయ్యాయి.ప్రత్యేకించి ఇండిగో సంస్థ ఒక హెచ్చరిక విడుదల చేస్తూ,వర్షాల ప్రభావంతో కొన్ని విమానాల షెడ్యూల్‌లో ఆలస్యం ఉండే అవకాశం ఉందని తెలిపింది.
వివరాలు
కర్ణాటక, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో వర్షాలు
ప్రయాణికులు తమ ప్రయాణానికి సంబంధించిన తాజా సమాచారం కోసం ఇండిగో అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేసుకోవాలని సూచించింది.
గోవా ప్రాంతంలో భారీ వర్షాలు పడుతున్న కారణంగా అక్కడి విమాన సర్వీసులు కూడా ప్రభావితమవుతున్నాయని సంస్థ స్పష్టం చేసింది.
ప్రస్తుతం కర్ణాటక, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి.
వాతావరణ శాఖ ఇచ్చిన తాజా హెచ్చరికల ప్రకారం, రాబోయే రెండు రోజులపాటు ఈ వర్షాలు మరింత ఉధృతంగా కురిసే అవకాశం ఉంది.
ఇప్పటికే ముంబై, బెంగళూరు వంటి మహానగరాల్లో రహదారులు జలమయమై, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
వాహనదారులు అపారమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాల కారణంగా రైళ్ల రాకపోకలు గల్లంతవుతున్నాయి. దీనివల్ల సాధారణ ప్రజలు తీవ్రమైన ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఇండిగో చేసిన ట్వీట్
IndiGo issues travel advisory. Tweets, "Goa is experiencing rain, which may affect flight operations..." pic.twitter.com/XQG6FSiD8B
— ANI (@ANI) May 21, 2025