
Indo-Pak Tensions: ఆరోగ్య మౌలిక సదుపాయాలపై జేపీ నడ్డా సమీక్ష
ఈ వార్తాకథనం ఏంటి
భారత్,పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో సైనిక చర్యలు కొనసాగుతున్నాయి.
దేశంలోని ఆరోగ్య రంగం సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని భావించిన కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, శుక్రవారం ఆరోగ్య శాఖ సీనియర్ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు.
దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులు, ఆరోగ్య సంబంధిత మౌలిక సదుపాయాల సన్నద్ధతను ఆయన సమీక్షించారు.
ప్రస్తుతం హాస్పిటల్స్, ఇతర ఆరోగ్య సౌకర్యాల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు, తగిన అవసరాల్ని గుర్తించి చర్యలు తీసుకుంటున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు మంత్రి జేపీ నడ్డాకు తెలియజేశారు.
వివరాలు
ఉగ్రదాడుల్లో సుమారు వంద మంది ఉగ్రవాదులు మృతి
ఇక, ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటనలో పర్యాటకులు సహా మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ దాడికి ప్రతీకారంగా భారత్ 'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ఉగ్రవాద శిబిరాలపై తీవ్ర సైనిక చర్యలు చేపట్టింది.
ఈ దాడుల్లో 9 ముఖ్యమైన ఉగ్ర స్థావరాలు, శిక్షణ కేంద్రాలను భారత సైన్యం ధ్వంసం చేసింది.
ఉగ్రదాడుల్లో సుమారు వంద మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు సమాచారం.
దీంతో సరిహద్దుల్లో పాక్ నుంచి జరుగుతున్న దాడులను భారత్ గట్టిగా తిప్పికొడుతోంది.