
Baglihar Dam:బాగ్లిహార్ డ్యాం గేట్లు ఎత్తేసిన భారత్.. దాయాది దేశంలో భయం భయం..
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.
ఈ ఉగ్రదాడి ప్రతీకారంగా, భారత ప్రభుత్వం "ఆపరేషన్ సిందూర్"ను చేపట్టింది.
ఈ ఆపరేషన్‌లో, పాకిస్తాన్ లోని పీఓకే (పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్)లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశారు.
ముఖ్యంగా, లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థల శిక్షణా శిబిరాలు ఈ దాడిలో ధ్వంసమయ్యాయి. ఈ దాడిలో సుమారు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
వివరాలు
''సింధు జలాల ఒప్పందం'' పై అనుమానాలు
ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో, ''సింధు జలాల ఒప్పందం'' పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
భారత్, చీనాబ్ నదిపై నిర్మించిన సలాల్, బాగ్లిహార్ డ్యామ్ల గేట్లను మూసివేయడంతో పాకిస్తాన్‌లోని నది పూర్తిగా ఎండిపోయింది.
తాజాగా, భారత్ బాగ్లిహార్ డ్యామ్ గేట్లను ఎత్తివేయడంతో, వరద నీరు పాకిస్తాన్ వైపు ప్రవహించడం ప్రారంభించింది.
దీంతో పాకిస్తాన్ లో మరొకసారి భయం పెరిగింది. అయితే, జమ్ముకశ్మీర్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీటి మట్టాలు పెరిగి, గేట్లను ఎత్తినట్లు తెలుస్తోంది. దీనిని ఉద్దేశపూర్వకంగా భారత్ చేపట్టలేదని సమాచారం అందుతోంది.
వివరాలు
భారత్ నీటిని ఒక అస్త్రంగా మార్చుకుంది: పాక్
ఈ గేట్లు ఎత్తేయడంతో వరద నీరు పాకిస్తాన్ వైపు వెళ్ళడం ప్రారంభించింది.
ముఖ్యంగా, ముజఫరాబాద్, సియాల్ కోట్ మరియు ఇతర నదీ ఒడ్డున ఉన్న ప్రాంతాలలో వరద ముంచెత్తే అవకాశాలు ఉన్నాయి.
పాకిస్తాన్ ఇప్పటికే భారత్ నీటిని ఒక అస్త్రంగా మార్చుకుందని ఆరోపిస్తోంది.
అలాగే, సింధు నది మరియు దాని ఉపనదుల నీటిని నిలిపివేయడం, పాకిస్తాన్ ప్రకారం యుద్ధ చర్యతో సమానం అని వారు అభిప్రాయపడుతున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బాగ్లిహార్ డ్యాం గేట్లు ఎత్తేసిన భారత్..
🚨 Multiple gates of Baglihar Dam OPENED after HEAVY RAINFALL raises Chenab river levels.
— Megh Updates 🚨™ (@MeghUpdates) May 8, 2025
— With the Indus Waters Treaty in abeyance, India will decide the flow — not Islamabad. pic.twitter.com/DslTdOAHxn