NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / International Yoga Day 2023: యోగా వ్యాప్తికి విశేష కృషి చేస్తున్న ఈ గురువుల గురించి తెలుసా? 
    తదుపరి వార్తా కథనం
    International Yoga Day 2023: యోగా వ్యాప్తికి విశేష కృషి చేస్తున్న ఈ గురువుల గురించి తెలుసా? 
    యోగా వ్యాప్తికి విశేష కృషి చేస్తున్న ఈ గురువుల గురించి తెలుసా?

    International Yoga Day 2023: యోగా వ్యాప్తికి విశేష కృషి చేస్తున్న ఈ గురువుల గురించి తెలుసా? 

    వ్రాసిన వారు Stalin
    Jun 21, 2023
    05:10 am

    ఈ వార్తాకథనం ఏంటి

    యోగ అనేది వ్యాయామ సాధానాల సమాహారం అని అంటుంటారు. వ్యాయామానికి ఆధ్యాత్మికత కలిస్తే అది యోగా అవుతుంది.

    భారతీయ సంస్కృతికి యోగాకు విడదీయరాని అనుబంధం ఉంది. 5,000 ఏళ్లుగా భారతీయ సమాజంతో యోగా తన బంధాన్ని పెనవేసుకుపోయింది.

    ఎందరో యోగులు చేసిన కృషి వల్ల యోగా భవిష్యత్ తరాలకు వారసత్వంగా అందింది. ఒకప్పుడు భారత్‌కు మాత్రమే పరిమితమైన యోగా, ఇప్పుడు విశ్వవ్యాప్తం అయ్యింది.

    మానవాళి ఆరోగ్యానికి యోగా ఇప్పుడు అండగా నిలుస్తోంది. ప్రపంచం మొత్తం బుధవారం 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్న నేపథ్యంలో యోగా అభివృద్ధికి కృషి చేస్తున్న ఐదుగురు గురువులను గురుంచి తెలుసుకుందాం.

    యోగ

    125 ఏళ్ల నాటి యోగా లెజెండ్ గురువు స్వామి శివానంద

    స్వామి శివానంద: స్వామి శివానంద యోగా వ్యాప్తికి వ్యాప్తికి విశేష కృషి చేశారు. ఆయన కృషికి గానూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.

    స్వామి శివానందకు 125 ఏళ్లు అయినా, తన పనులను తానే చేసుకుంటారు. ఎవరి సాయం లేకుండా నడుస్తుంటారు. పశ్చిమ బెంగాల్‌లోని సిల్హెట్ జిల్లాలో జన్మించిన స్వామి శివానంద తన జీవితాన్ని మానవ సమాజ సంక్షేమానికి అంకితం చేశారు.

    స్వామి శివానంద చిన్నతనంలో కడు పేదరికాన్ని అనుభవించారు. ఆయన 6 సంవత్సరాల వయస్సులో తల్లి, తండ్రిని కోల్పోయారు.

    ఆ తర్వాత పశ్చిమ బెంగాల్‌లోని నబద్వీప్‌లో గల గురు ఓంకారానంద గోస్వామి గురూజీ ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ స్వామి శివానంద యోగాను అభ్యసించి, దేశంలో యోగా లెజెండ్‌గా మారారు.

    యోగ

    సుదర్శన్ క్రియను సాధించిన శ్రీశ్రీ రవిశంకర్

    జగ్గీ వాసుదేవ్: జగ్గీ వాసుదేవ్‌ను సద్గురు అని కూడా పిలుస్తుంటారు. ఈయన కర్ణాటకకు చెందినవారు. అతను ప్రపంచవ్యాప్తంగా యోగా కార్యక్రమాలను అందించే ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు. జగ్గీ వాసుదేవ్‌ యోగా వ్యాప్తికి విశేష కృషి చేస్తున్నారు. జీవిత ఖైదీల కోసం అనేక యోగా కార్యక్రమాలు నిర్వహించారు.

    శ్రీశ్రీ రవిశంకర్: ఈయన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు. యోగాలో సుదర్శన్ క్రియ అని పిలువబడే రిథమిస్ బ్రీతింగ్ ప్రాక్టీస్‌ను ప్రాచుర్యంలోకి తెచ్చారు.

    కర్నాటకలోని భద్రా నది ఒడ్డున 10 రోజుల సుదీర్ఘ ధ్యానం తర్వాత సుదర్శన్ క్రియను ఆయన పొందారు.

    తమిళనాడులో పుట్టిన శ్రీశ్రీ రవిశంకర్‌కు ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి. వాటి ద్వారా యోగాను వ్యాప్తి చేస్తున్నారు.

    యోగ

    బాబా రామ్‌దేవ్ యోగా శిబిరాలకు విశేష ఆదరణ

    బాబా రామ్‌దేవ్: ప్రస్తుతం బాబా రామ్‌దేవ్ యోగా శిబిరాల కంటే రాజకీయ సర్కిల్‌లో ఎక్కువగా కనిపిస్తున్నారు. సామూహిక యోగా శిబిరాలను నిర్వహించి, యోగాను సామాన్యూలకు అందుబాటులోకి రామ్‌దేవ్ తీసుకొచ్చారు. టీవీలో అతని కార్యక్రమాలు విజయవంతమయ్యాయి.

    ఈ క్రమంలో రామ్‌దేవ్ ఇంటి పేరు 'యోగా'గా మారింది. యోగా యోగులకే కాదు సామాన్యులకు కూడా అనే సిద్ధాంతంతో భారత్‌లో యోగా వ్యాప్తికి బాబా రామ్‌దేవ్ తీవ్రంగా శ్రమించారు.

    బిక్రమ్ చౌదరి: భారత్‌లోని ప్రముఖ యోగా గురువుల్లో బిక్రమ్ చౌదరి ఒకరు. ఈయన 40 డిగ్రీల సెల్సియస్ వేడి వాతావరణంలో సాధన చేయడానికి ఉద్దేశించిన ప్రసిద్ధ 26 రకాల భంగిమలతో ఒక యోగా శ్రేణిని ఆయన తీర్చిదిద్దారు. ప్రతి భంగిమ శరీరం నిర్దిష్ట భాగానికి ప్రయోజనం చేకూరుస్తుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    యోగ
    ప్రపంచం
    వరల్డ్ లేటెస్ట్ న్యూస్
    తాజా వార్తలు

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    యోగ

    యోగసనాలతో ముడతలు దూరం చలికాలం
    నరాల బలహీనత వల్ల కాళ్ళలో వణుకు పుడుతుందా? ఈ యోగాసనాలు ప్రయత్నించండి వ్యాయామం
    ఐబీఎస్ తో ఇబ్బందిపడేవారు ఈ యోగాసనాలతో ఉపశమనం పొందండి లైఫ్-స్టైల్
    వెరికోస్ వెయిన్స్ లేదా ఉబ్బు నరాలు తగ్గిపోవాలంటే చేయాల్సిన యోగాసనాలు వ్యాయామం

    ప్రపంచం

    బుల్లి బహుబలి.. 8 ఏళ్ల వయస్సులోనే రికార్డులను సృష్టించింది  స్పోర్ట్స్
    ఢిల్లీ ప్రజలకు హెచ్చరిక.. రానున్న 3-4 రోజుల్లో పిడుగులు పడే అవకాశం రాజధాని
    డానిల్ మాద్వెదెవ్‌కు బిగ్ షాక్.. ఫ్రెంచ్ ఓపెన్‌లో మరోసారి ఓటమి టెన్నిస్
    ప్రపంచాన్ని భయపెడుతున్న బర్డ్ ఫ్లూ.. పెరుగుతున్న కేసుల సంఖ్య భారతదేశం

    వరల్డ్ లేటెస్ట్ న్యూస్

    లక్ష మంది లోపే జనాభా ఉన్న ఈ దేశాల గురించి తెలుసా? వాటికన్ సిటీ
    ఇండోనేషియాలో 7.3 తీవ్రతతో భారీ భూకంపం; సునామీ హెచ్చరికలు  ఇండోనేషియా
    కారణం లేకుండానే బ్రియాన్ హంఫ్రీస్‌ను సీఈఓగా తొలగించిన కాగ్నిజెంట్ వ్యాపారం
    తాలిబన్ చేతిలో కాబూల్‌ విమానాశ్రయంలో ఉగ్రదాడి సూత్రదారి హతం  ఆఫ్ఘనిస్తాన్

    తాజా వార్తలు

    తిరుపతి: గోవిందరాజస్వామి ఆలయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం తిరుపతి
    మహారాష్ట్ర యువతి ప్రపంచ రికార్డ్; 127గంటల పాటు డ్యాన్స్  మహారాష్ట్ర
    నెహ్రూ మెమోరియల్ మ్యూజియం పేరు మార్చిన కేంద్రం; కాంగ్రెస్ ఫైర్ నరేంద్ర మోదీ
    అలా చేస్తే రాజస్థాన్‌‌లో మేం పోటీచేయం; కాంగ్రెస్‌కు ఆప్ బంపర్ ఆఫర్ ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025