
Kolkata: కోల్‌కతా ఆసుపత్రి కీలక నిర్ణయం.. బంగ్లాదేశ్ రోగులకు చికిత్స ఇవ్వమని ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలోని జేఎన్ రే ఆసుపత్రి కీలక నిర్ణయం తీసుకుంది.
బంగ్లాదేశ్ రోగులకు చికిత్స అందించమని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం భారతదేశ జెండాను అవమానించడమే కాకుండా, బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై జరిగే దాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
ఆసుపత్రి అధికారి సుభ్రాంషు భక్త్ శుక్రవారం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
ఈ రోజు నుంచి నిరవధికంగా బంగ్లాదేశ్ రోగులను చికిత్స కోసం అంగీకరించమని నిర్ణయించుకున్నామని, వారు భారత్ పట్ల చూపించిన అవమానాల కారణంగా ఈ చర్యలు తీసుకున్నామని ఆయన వెల్లడించారు.
Details
త్రివర్ణ పతాకాన్ని అవమానించిన బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ ప్రజలు తాజాగా భారతదేశ వ్యతిరేక భావాలను వ్యక్తం చేస్తూ త్రివర్ణ పతాకాన్ని అవమానించినారని అన్నారు.
ఈ నేపథ్యంలో, ఇతర ఆసుపత్రులు కూడా బంగ్లాదేశ్ రోగులకు చికిత్స ఇవ్వకుండా నిర్ణయం తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
తమ నిర్ణయానికి ఇతర ఆసుపత్రులు మద్దతు ఇవ్వాలని ఆశిస్తున్నామని కూడా చెప్పారు.