Ap Weather Updates : అమ్మబాబోయ్.! ఏపీలోని ఈ ప్రాంతాలకు భారీ వర్ష సూచన.. రాయలసీమ మీదుగా మరో ఉపరితల ద్రోణి
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా ప్రాంతానికి వాతావరణశాఖ వర్ష సూచన జారీ చేసింది.
ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని అంచనా వేసింది.
అయితే, మిగిలిన ప్రాంతాల్లో పొడి వాతావరణమే కొనసాగుతుందని తెలిపింది.
తెలంగాణకు మాత్రం వర్ష సూచన లేదు. వాతావరణ మార్పుల కారణంగా, గంగా పరివాహక పశ్చిమ బెంగాల్, అంతర్గత ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఇది ఉత్తర బంగ్లాదేశ్ నుంచి తెలంగాణ వరకు సుమారు 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. అయితే, ఇది ప్రస్తుతం బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
వివరాలు
ఉపరితల ద్రోణి తూర్పు ప్రాంతంలో రాయలసీమ నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్ వరకు
అంతేకాక, మరో ఉపరితల ద్రోణి తూర్పు ప్రాంతంలో రాయలసీమ నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్ వరకు విస్తరించి ఉంది.
ఇది సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వరకు విస్తరించినట్లు తాజా వాతావరణ బులెటిన్‌లో పేర్కొన్నారు.
ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాలో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఉదయాన్నిపూట కొన్ని ప్రాంతాల్లో పొగమంచు ఏర్పడే సూచనలు ఉన్నాయని పేర్కొంది.
గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని మించి 2-3 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
వివరాలు
రాయలసీమ ప్రాంతంలో మూడు రోజులు పొడి వాతావరణమే..
దక్షిణ కోస్తాలో ఇవాళ, రేపు, ఎల్లుండి పొడి వాతావరణం కొనసాగనుంది. కానీ, ఉదయాన్నిపూట కొన్ని ప్రాంతాల్లో పొగమంచు కురిసే అవకాశముంది.
ఇదే సమయంలో, ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి మించి 2-3 డిగ్రీల మేర పెరిగే సూచనలు ఉన్నాయి.
రాయలసీమ ప్రాంతంలో కూడా రాబోయే మూడు రోజులు పొడి వాతావరణమే కొనసాగుతుందని తెలిపింది.
ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి మించి 2-3 డిగ్రీల మేర పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. ఏ విధమైన వాతావరణ హెచ్చరికలు లేవని స్పష్టంగా ప్రకటించారు.
వివరాలు
తెలంగాణలో కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు
తెలంగాణలో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉండనుంది. ఉదయం వేళ కొన్ని ప్రాంతాల్లో పొగమంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఉష్ణోగ్రతల్లో ఎలాంటి గణనీయమైన మార్పు ఉండదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
గత గురువారం తెలంగాణలో కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురవగా, వాతావరణం కొద్దిగా చల్లబడింది.
అయితే, తాజా వాతావరణ బులెటిన్ ప్రకారం రాబోయే రోజుల్లో రాష్ట్రానికి వర్ష సూచన లేదని స్పష్టంగా పేర్కొన్నారు.