LOADING...
Rain Alert: తెలుగు రాష్ట్రాలపై వరుణుడి ప్రభావం.. రానున్న రెండు రోజులు జాగ్రత్తగా ఉండండి!
తెలుగు రాష్ట్రాలపై వరుణుడి ప్రభావం.. రానున్న రెండు రోజులు జాగ్రత్తగా ఉండండి!

Rain Alert: తెలుగు రాష్ట్రాలపై వరుణుడి ప్రభావం.. రానున్న రెండు రోజులు జాగ్రత్తగా ఉండండి!

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 15, 2025
08:59 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు రాష్ట్రాల్లో వరుసగా వర్షాలు కొనసాగుతున్నాయి. వాతావరణ శాఖ ప్రకారం, రుతుపవన ద్రోణి, అల్పపీడన ప్రభావంతో ఈ వర్షాలు ఇంకా నాలుగు రోజుల పాటు విస్తృతంగా కురిసే అవకాశముందని వెల్లడించింది. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ప్రమాదం ఉంది అని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ రోజు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో తుఫానుగాలులు కూడా వీస్తాయని వివరించారు. ప్రత్యేకంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట వంటి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు.

వివరాలు 

పిడుగులు పడే ప్రమాదం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఈ రోజు ఎల్లో అలర్ట్ వర్తించగా,వచ్చే నాలుగు రోజులు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమే కాకుండా పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని అధికారులు తెలియజేశారు. ప్రత్యేకంగా అల్లూరి,కాకినాడ,కోనసీమ,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి వంటి జిల్లాల్లో జోరుగా వర్షాలు, పిడుగులు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.