Page Loader
Commercial LPG cylinder: పెరిగిన కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరలు!
Commercial LPG cylinder: పెరిగిన కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరలు!

Commercial LPG cylinder: పెరిగిన కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరలు!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 01, 2023
08:20 am

ఈ వార్తాకథనం ఏంటి

గ్యాస్ వినియోగదారులకు బ్యాడ్‌న్యూస్. 19 కిలోల కమెర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ రేటు మరోసారి పెరిగింది. ఈ రేట్ల పెంపు నిర్ణయం ఇవాళ్టి నుంచే అంటే నవంబర్ 1 నుంచే అమలులోకి వస్తాయని తెలిపాయి. ప్రస్తుతం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను మాత్రమే పెంచాయి. ఈ సిలిండర్ ధర ఏకంగా రూ. 100 మేర పెరిగింది. గత రెండు నెలల్లో కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలు పెంచడం ఇది రెండోసారి. సాధారణంగా వాణిజ్య, గృహ వినియోగ సిలిండర్ ధరలను ప్రతి నెలా ఒకటో తేదీన చమురు మార్కెటింగ్ కంపెనీలు సమీక్షిస్తాయి.

Details 

సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఊరట

తాజా సవరణతో, 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ ధర ఇప్పుడు దిల్లీలో రూ. 1,731కి బదులుగా రూ.1,833 అవుతుంది. ముంబైలో కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ రూ.1,785.50, కోల్‌కతాలో రూ.1,943, చెన్నైలో రూ.1,999.50లకు అందుబాటులో ఉంటుంది. చమురు కంపెనీలు 209 రూపాయలు పెంచడంతో అక్టోబర్‌లో వాణిజ్య ఎల్‌పిజి సిలిండర్ల ధరలు ముంబైలో రూ.1,684, కోల్‌కతాలో రూ.1,839.50, చెన్నైలో రూ.1,898గా ఉన్నాయి. అయితే, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు చేయకుండా సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఊరట కలిగించాయి .