Page Loader
Indian Army: డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్‌ 
డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్‌

Indian Army: డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 09, 2025
05:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

పహల్గామ్‌లో జరిగిన దాడి, ఆపరేషన్ సిందూర్ తరువాత, లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ కీలకంగా మారారు. ఈ ఆపరేషన్‌లో ప్రధాన పాత్ర పోషించిన ఆయనకు ఇప్పుడు మరో గొప్ప బాధ్యతను భారత ప్రభుత్వం అప్పగించింది. ఆయనను 'డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్'గా నియమించడమే కాక, ఇకపై ఆయన 'డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్' (DGMO) హోదాలోనూ పనిచేయనున్నారు. రక్షణ మంత్రిత్వ శాఖ ఈ నియామకాన్ని అధికారికంగా ప్రకటించింది. భారత సైన్యం,నిఘా వ్యవస్థలు, ఇతర కీలక విభాగాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచేందుకు 'డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ - స్ట్రాటజీ' అనే కొత్త పదవిని రూపొందించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

వివరాలు 

అత్యుత్తమ యుద్ధ సేవకు గౌరవం 

ఈ హోదా భారత ఆర్మీలో అత్యంత ప్రాధాన్యం ఉన్న పదవుల్లో ఒకటిగా పేర్కొనబడింది. 2025, జూన్ 4న నిర్వహించిన 'డిఫెన్స్ ఇన్వెస్టిచర్ సెర్మనీ' సందర్భంగా లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్‌కు 'ఉత్తమ యుద్ధ సేవా పతకం' ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆపరేషన్ సింధూర్ సమయంలో సైనిక మీడియా సమావేశానికి నేతృత్వం వహించారు. ఈ సమయంలో పాకిస్థాన్‌ డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ ఘాయ్‌కు కాల్ చేసి కాల్పుల విరమణ విషయంపై చర్చించారు. అనంతరం మే 12న జరిగిన మీడియా సమావేశంలో భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణను అధికారికంగా ప్రకటించారు.

వివరాలు 

లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ ఎవరు? 

లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, కుమావున్ రెజిమెంట్‌కు చెందిన సీనియర్ అధికారి. ఆయన భారత సైన్యంలో అనేక కీలక ఆపరేషన్లకు నాయకత్వం వహించారు. డీజీఎంఓగా నియమించబడే ముందు, ఆయన చినార్ కార్ప్స్‌కు జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (GOC)గా పనిచేశారు. విశేషంగా జమ్ముకశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాద వ్యతిరేక చర్యల సందర్భంగా జరిగిన అనేక కీలక మిషన్లలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. ఈ అనుభవం, నైపుణ్యం ద్వారా ఆయన భారత సైన్యంలో ఒక విశ్వసనీయ నాయకుడిగా గుర్తింపు పొందారు.