రచయిత్రి మధుమితా శుక్లా హత్య కేసులో మాజీ మంత్రి దంపతులకు బెయిల్
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్‌ప్రదేశ్ రచయిత్రి,మధుమితా శుక్లా హత్య కేసులో నిందితుల విడుదలకు సుప్రీం స్టే నిరాకరించింది. ఈ మేరకు 8 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని శుక్రవారం ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది.
17 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న మాజీ మంత్రి అమరమణి త్రిపాఠి, ఆయన భార్య మధుమణి త్రిపాఠిలను గురువారం రిలీజ్ చేస్తూ యూపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జైళ్ల శాఖ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
మధుమితా హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నలుగురు నిందితులకు బెయిల్ లభించింది. అమరమణి, అతని భార్య, మరో ఇద్దరు వ్యక్తులకు 2006లో డెహ్రాడూన్ సెషన్స్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మధుమిత శుక్లా 2003 మే 9న దారుణ హత్యకు గురయ్యారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మాజీ మంత్రి దంపతులకు బెయిల్ మంజూరీ చేసిన యూపీ ప్రభుత్వం
Uttar Pradesh Prisons Administration department issued an order for the release of former UP minister Amarmani Tripathi and his wife Madhumani Tripathi, serving life terms in the Madhumita Shukla murder case.
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 25, 2023
Details
బీజేపీకి అవసరం ఉంటే ముఖ్తార్ అన్సారీ సాయం కూడా తీసుకుంటారు: మనోజ్
మాజీ మంత్రి దంపతులను గురువారం రిలీజ్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించగానే హతురాలు మధుమితా సోదరి నిధి శుక్లా సుప్రీంను ఆశ్రయించారు.
ఆ నలుగురికి జీవిత ఖైదు పడిందని,వారికి బెయిల్ ను ఇవ్వొద్దని కోరారు. ఈ మేరకు విచారించిన సుప్రీంకోర్టు, స్టే ఇవ్వలేమని వెల్లడించింది.
మరోవైపు మాజీ మంత్రి అమరమణి విడుదలపై సమాజ్ వాదీ పార్టీ ఖండించింది.ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి కోసమే యోగీ సర్కార్ వారిని విడుదల చేస్తోందని ఆ పార్టీ మండిపడుతోంది.
యూపీలో యోగీ మోదీ మోడల్ ముగిసిపోయిందని, అందుకే ఎన్నికల కోసం ఇలాంటి వారిని విడుదల చేస్తున్నారని పార్టీ ప్రతినిధి మనోజ్ యాదవ్ ఫైరయ్యారు. వారికి అవసరం ఉంటే 2024 ఎన్నికల్లో ముఖ్తార్ అన్సారీ సాయం కోసం వెనుకాడరని ఎద్దేవా చేశారు.