Eknath Shinde-Ajit Pawar: ఎన్సీపీ అధినేత అజిత్ పవార్‌ను లక్ష్యంగా.. ఆపద్ధర్మ సీఎం ఏక్‌నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు
మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకై మరికొన్ని గంటలే ఉంది . ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడణవీస్, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో శిందే, అజిత్ పవార్‌పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. "గురువారం సాయంత్రం 5.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. రేపటి సాయంత్రానికి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన వివరాలు తేలిపోతాయి. ఈ మధ్యే నేను ఏక్‌నాథ్ శిందేతో సమావేశమై, మహాయుతి ప్రతీ కార్యకర్తకు ప్రభుత్వంలో చేరాలని కోరిక ఉందని చెప్పాను. ఆయన స్పందన సానుకూలంగా ఉంటుంది అని నేను నమ్ముతున్నాను" అని దేవేంద్ర ఫడణవీస్ పేర్కొన్నారు.
షిండేకు సాయంత్రం వరకు తెలిసి వస్తుందోమో: అజిత్
మరికొన్ని గంటల్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, అజిత్ పవార్, ఏక్‌నాథ్ శిందే డిప్యూటీ సీఎం పదవులు స్వీకరించబోతున్నారా అన్న ప్రశ్నకు శిందే సమాధానమిచ్చారు. దీనిపై నిర్ణయం కొలిక్కి రావాలంటే సాయంత్రం వరకు వేచి చేయాల్సిందేనని తెలిపారు. ఈ క్రమంలోనే అజిత్ పవార్ మాట్లాడుతూ.. తానూ ప్రమాణ స్వీకారం చేస్తానని, షిండేకు సాయంత్రం వరకు తెలిసి వస్తుందోమోనని వ్యాఖ్యానించారు.
అజిత్ పై షిండే చురకలు
అజిత్ పవార్ వ్యాఖ్యలపై శిందే "అజిత్‌కు ఉదయం, సాయంత్రం పూట ప్రమాణ స్వీకారం చేసిన అనుభవం ఉన్నప్పుడు, ఆయన వాడే విధానాలు స్పష్టంగా కనిపిస్తాయి," అంటూ చురకలు వేసారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. మహాయుతి కూటమి 5 డిసెంబరున కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. భాజపా సీనియర్ నేత దేవేంద్ర ఫడణవీస్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. ఫడణవీస్, శిందే, అజిత్ రాజ్‌భవన్‌కు చేరుకుని, గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కలసి ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకారాన్ని కోరారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న వీరు.. ఈ వ్యాఖ్యలు చేశారు.