
NCP Crisis: మామ మీకు 83ఏళ్లు, రిటైర్ అవ్వండి; శరద్ పవార్‌పై అజిత్ విమర్శలు
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తన మామ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూనే, ఆయనే తమ ఆరాధ్య దైవం అని కొనియాడారు.
బాంద్రా ఎంఈటీ సెంటర్‌లో జరిగిన సమావేశంలో అజిత్ పవార్ మాట్లాడారు. అందరి ముందు తనను విలన్‌గా చూపించావని శరద్ పవార్‌పై అజిత్ పవార్ మండిపడ్డారు. అయినా ఆయనపై ఇప్పటికీ తనకు చాలా గౌరవం ఉందన్నారు.
ఐఏఎస్ అధికారులు 60 ఏళ్లకే రిటైర్ అవుతారని, రాజకీయాల్లో కూడా బీజేపీ నేతలు 75 ఏళ్లకే రిటైర్ అవుతున్నారని, అందుకు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలే ఉదాహరణ అని పేర్కొన్నారు. అది కొత్త తరం ఎదగడానికి ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు.
ఎన్సీపీ
శరద్ పవార్ వల్లే సీఎం పీఠాన్ని వదులుకున్నాం: అజిత్
'మీకు ఇప్పుడు 83 ఏళ్లు, ఇక మీరు విశ్రాంతి తీసుకోవాలి. మీ ఆశీర్వాదాలు మాకు అందించండి. మీరు దీర్ఘాయుష్షు పొందాలని మేము ప్రార్థిస్తున్నాము' అని బాంద్రాలో పార్టీ శాసనసభ్యులు, కార్యకర్తలను ఉద్దేశించి అజిత్ పవార్ మాట్లాడారు.
2004లో మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పటికీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని ఎస్పీపీ కోల్పోవడానికి శరద్ పవార్ కారణమని అజిత్ పవార్ ఆరోపించారు.
2017లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన వర్షా బంగ్లాలో జరిగిన సమావేశాన్ని కూడా ఈ సందర్భంగా అజిత్ ప్రస్తావించారు.
కేబినెట్ పోర్ట్‌ఫోలియో కేటాయింపు, మంత్రి పదవులపై బీజేపీ-ఎన్సీపీ మధ్య చర్చలు జరిగాయని, కానీ తర్వాత తమ పార్టీ వెనక్కి వేసిందని అజిత్ పవార్ పేర్కొన్నారు.
ఎన్సీపీ
జాతీయ ప్రయోజనాల కోసమే బీజేపీతో కలిశాం: ప్రఫుల్ పటేల్
ఏక్నాథ్ షిండే-దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో చేరడంపై అజిత్ పవార్ వర్గం నాయకుడు ప్రఫుల్ పటేల్ స్పందించారు.
భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్లడానికి అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. శివసేన సిద్ధాంతాన్ని అంగీకరించినప్పుడు, బీజేపీతో కలిసి వెళ్లడానికి ఇబ్బంది ఏంటని ప్రపుల్ పటేల్ అడిగారు.
పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్‌లో బీజేపీతో కలిసి వెళ్లారని, ఇప్పుడు వారు ఉమ్మడి ప్రతిపక్షంలో భాగమయ్యారని ప్రఫుల్ పటేల్ అన్నారు.
అయితే జాతీయ ప్రయోజనాల కోసమే తాము ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో చేరామని చెప్పారు.