Page Loader
మే 28న కొత్త పార్లమెంట్ భవనం ఎదుట రెజ్లర్ల మహిళా మహాపంచాయతీ
మే 28న కొత్త పార్లమెంట్ భవనం ఎదుట రెజ్లర్ల మహిళా మహాపంచాయతీ

మే 28న కొత్త పార్లమెంట్ భవనం ఎదుట రెజ్లర్ల మహిళా మహాపంచాయతీ

వ్రాసిన వారు Stalin
May 24, 2023
09:18 am

ఈ వార్తాకథనం ఏంటి

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా దిల్లీలో నిరసన తెలుపుతున్న భారత స్టార్ రెజ్లర్లు మే 28న కొత్త పార్లమెంట్ భవనం ఎదుట మహిళా మహాపంచాయతీ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే అదే రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనుండటం గమనార్హం. మే 28న కొత్త పార్లమెంటు ఎదుట శాంతియుతంగా మహిళా మహాపంచాయతీ నిర్వహించాలని తాము నిర్ణయించుకున్నట్లు రెజ్లర్ వినేష్ ఫోగట్ తెలిపారు.

దిల్లీ

మహిళల ఆధ్వర్యంలో మహాపంచాయతీ

మహిళలు నాయకత్వం వహిస్తారని వినేష్ ఫోగట్ స్పష్టం చేశారు. ఈ సమస్య అందిరికీ తెలియాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇప్పుడు దేశంలోని ఆడపిల్లలకు న్యాయం జరిగితే, రాబోయే తరాలు దాని నుంచి ధైర్యం పొందుతారని పేర్కొన్నారు. శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్‌లతో సహా పలువురు అగ్రశ్రేణి రెజ్లర్లు ఏప్రిల్ 23 నుంచి దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేస్తున్నారు. రెజ్లర్ల ఫిర్యాదు అనంతరం సుప్రీంకోర్టు జోక్యంతో ఏప్రిల్ 28న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి దిల్లీ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 విలేకరులతో మాట్లాడిన  వినేష్ ఫోగట్