Page Loader
Mahua Moitra: మోయిత్రా బహిష్కరణకు లోక్‌సభ ఎథిక్స్ కమిటీ సిఫార్సు.. శీతాకాల సమావేశాల్లో సభ ముందుకు 
Mahua Moitra: మోయిత్రా బహిష్కరణకు లోక్‌సభ ఎథిక్స్ కమిటీ సిఫార్సు..శీతాకాలసమావేశాల్లో సభ ముందుకు

Mahua Moitra: మోయిత్రా బహిష్కరణకు లోక్‌సభ ఎథిక్స్ కమిటీ సిఫార్సు.. శీతాకాల సమావేశాల్లో సభ ముందుకు 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 09, 2023
10:38 am

ఈ వార్తాకథనం ఏంటి

తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) లోక్‌సభ ఎంపీ మహువా మోయిత్రా ఉద్వాసనకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు తన లాగిన్ వివరాలను భారతదేశం వెలుపల నివసిస్తున్న ఓ వ్యాపారవేత్తతో పంచుకున్నారనే ఆరోపణలపై లోక్‌సభ ఎథిక్స్ కమిటీ బహిష్కరణకు సిఫార్సు చేయనుంది. మహువా చర్య అనైతిక ప్రవర్తనకు కారణమని ప్యానెల్ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే అధికారులు బుధవారం ప్రకటించారు. బుధవారం సాయంత్రం 15 మంది సభ్యుల ప్యానెల్ సభ్యుల ముందు 500 పేజీల ముసాయిదా నివేదికను ప్రవేశపెట్టారు. అయితే గురువారం సమావేశంలో సదరు నివేదికను ఆమోదించనున్నారు. డిసెంబరు4న ప్రారంభంకానున్న శీతాకాల సమావేశాల తొలిరోజున నివేదికను లోక్‌సభలో ఉంచనున్నారు. మరోవైపు 500 పేజీల కమిటీ నివేదిక ముందే ఎలా అదానీ టీవీకి లీకైందని మహవా మోయిత్రా ప్రశ్నించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఎథిక్స్ కమిటీని విమర్శిస్తున్న మహువా మోయిత్రా