Page Loader
Mahua Moitra : వ్యక్తిగత సంబంధమే ఈ రచ్చకు కారణం.. ఎథిక్స్ కమిటీ ముందు ఎంపీ మహువా మోయిత్రా
Mahua Moitra: వ్యక్తిగత సంబంధమే రచ్చకు కారణం..ఎథిక్స్ కమిటీ ముందు మహువా మోయిత్రా

Mahua Moitra : వ్యక్తిగత సంబంధమే ఈ రచ్చకు కారణం.. ఎథిక్స్ కమిటీ ముందు ఎంపీ మహువా మోయిత్రా

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 02, 2023
04:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా 'క్యాష్ ఫర్ క్వేరీ' కేసులో ఇవాళ పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ ముందు హాజరయ్యారు. లోక్ సభలో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి ఆమె డబ్బులు,గిఫ్టులు తీసుకున్నారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఎంపీకి సంబంధించిన పార్లమెంట్ లాగిన్ ఐడీ వివరాలను ఆమె ఇతరులతో పంచుకున్నారన్న దూబే,దుబాయ్ లో పలుమార్లు లాగిన్ అయినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ ముందు ఇవాళ హాజరైన మహువా, తన వాదనల్ని వినిపించారు. వ్యక్తిగత సంబంధంలోని అపార్థాల వల్లే తనపై క్యాష్ ఫర్ క్వేరీ కేసు ఆరోపణలకు కారణమన్నారు. వ్యాపారవేత్త హీరానందానీకి లాగిన్ వివరాలు ఇచ్చానన్న ఎంపీ, ప్రశ్నలు మాత్రం తనవేనని చెప్పుకొచ్చారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఎథిక్స్ కమిటీ నుంచి వెలుపలికి వస్తున్న  మహువా మోయిత్రా