Page Loader
IndiGo flight: ఇండిగో విమానంలో మహిళని లైంగికంగా వేధించిన వ్యక్తి అరెస్టు..!
ఇండిగో విమానంలో మహిళని లైంగికంగా వేధించిన వ్యక్తి అరెస్టు..!

IndiGo flight: ఇండిగో విమానంలో మహిళని లైంగికంగా వేధించిన వ్యక్తి అరెస్టు..!

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 11, 2024
10:09 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇండిగో విమానంలో ఓ మహిళ లైంగిక వేధింపులకు గురైంది. మహిళ చేసిన ఫిర్యాదు ఆధారంగా, సంబంధిత వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఢిల్లీ-చెన్నై ఇండిగో ఫ్లైట్‌లో చోటు చేసుకుంది. మహిళ తన కంప్లైంట్‌లో, విమానంలో ఆమె వెనకాల నిందితుడు కూర్చున్నాడని పేర్కొంది. బాధితురాలు నిద్రలో ఉన్న సమయంలో, తన వెనుక సీట్లో కూర్చున్న 43 ఏళ్ల రాజేశ్ అనే వ్యక్తి ఆమె శరీరాన్ని అసభ్యంగా తాకాడని విమాన సిబ్బందికి తెలిపింది. గురువారం సాయంత్రం 4:30 గంటలకు విమానం చెన్నైలో దిగిన తర్వాత, ఆ మహిళ ఎయిర్‌లైన్ సిబ్బందిని ఈ విషయాన్ని చెరవేసింది.

వివరాలు 

చెన్నై పోలీసులు అదుపులో రాజేష్ శర్మ 

ఈ సందర్భంగా, పోలీసులకు ఫిర్యాదు చేయడంలో ఆ మహిళకు విమానాశ్రయ సిబ్బంది సహాయం అందించారు. అందువల్ల, ఆమెను లైంగిక వేధింపులకు గురి చేసిన రాజేష్ శర్మ అనే వ్యక్తిని చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌) చట్టం కింద అతడిపై కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నారు. నిందితుడు రాజస్థాన్‌కు చెందినవాడైనప్పటికీ, చాలా కాలంగా చెన్నైలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.