Page Loader
Chandrababu: అంతర్జాతీయ ప్రమాణాలతో మామిడి సాగు చేయండి.. రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన
అంతర్జాతీయ ప్రమాణాలతో మామిడి సాగు చేయండి.. రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు

Chandrababu: అంతర్జాతీయ ప్రమాణాలతో మామిడి సాగు చేయండి.. రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 04, 2025
01:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

మామిడి సాగులో రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి, ఉత్తమ వ్యవసాయ విధానాలు పాటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు సూచించారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మామిడిని పండించాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా మన ఉత్పత్తులు అమ్ముడుపోవాలంటే ఇదే సరైన మార్గమని వివరించారు. గురువారం సాయంత్రం ఆయన మామిడి రైతులు, గుజ్జు పరిశ్రమల యజమానులు,సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మామిడి గుజ్జు తయారీ సంస్థలు రైతులకు కిలో మామిడికి కనీసం రూ.8 చెల్లించాల్సిందేనని స్పష్టంగా తెలిపారు. ప్రస్తుతం మామిడి గుజ్జుపై ఉన్న 12 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నానని వెల్లడించారు.

వివరాలు 

కార్యకర్తలతో చంద్రబాబు సమీక్ష: సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లండి

మరోవైపు, పరిశ్రమల ప్రతినిధులు మాట్లాడుతూ,ప్రస్తుతం బాహ్య మార్కెట్ల నుంచి సరైన ఆర్డర్లు రావడం లేదని,గుజ్జు రవాణాకు (అన్‌లోడింగ్‌) 3 నుంచి 4 రోజులు సమయం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ద్వారా మామిడి జ్యూస్‌ అందించాలన్న అభ్యర్థనపై సీఎం స్పందిస్తూ,ఆఅంశాన్ని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. కొందరు రాజకీయంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని,అలాంటి మాయల మాటల్లో పడకుండా రైతులు జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు హెచ్చరించారు. అదే సాయంత్రం జరిగిన పార్టీ సమావేశంలో తెదేపా అధినేత చంద్రబాబు, క్లస్టర్,యూనిట్,బూత్‌ ఇన్‌ఛార్జులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం,అభివృద్ధి కార్యక్రమాలలో కార్యకర్తలు చురుకుగా పాల్గొని, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

వివరాలు 

కార్యకర్తల నైపుణ్యాన్ని మెరుగుపరచేందుకు.. లీడర్‌షిప్‌ ట్రైనింగ్‌ కార్యక్రమాలు

"ప్రజలకు దగ్గరగా ఉండే వారే నాకు కూడా దగ్గర. పేరు చెడితే, నమస్కారం పెట్టి పక్కన పెడతాను. కేవలం కుప్పంలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ఇదే విధానాన్ని అనుసరిస్తాను" అని చంద్రబాబు తేల్చిచెప్పారు. కార్యకర్తల నైపుణ్యాన్ని మెరుగుపరచేందుకు లీడర్‌షిప్‌ ట్రైనింగ్‌ కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. అనంతరం శాంతిపురం మండలంలోని తుమ్మిశి గ్రామం నుంచి హెలికాప్టర్‌లో బెంగళూరుకు వెళ్లారు.