మణిపూర్ దుస్థితికి కాంగ్రెస్సే కారణమన్న బీరెన్ సింగ్.. సీఎం రాజీనామాకు సీపీఐ పట్టు
మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజకీయంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు కాంగ్రెస్ పార్టీనే కారణమన్నారు. హింసను సృష్టించింది కాంగ్రెస్సేనని ఆరోపణలు గుప్పించారు. ప్రజల జీవితాలతో రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రస్తుతం లడఖ్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మణిపూర్ హింసపై మాట్లాడటాన్ని బీరెన్ సింగ్ తప్పుబట్టారు. రాహుల్ లడఖ్‌లో పర్యటిస్తే లడఖ్ గురించే మాట్లాడాలని బీరెన్ హితవు పలికారు. లడఖ్‌లో ఉన్నప్పుడు మణిపూర్‌లో జరిగే అంశాలపై ఎలా మాట్లాడుతారని అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు ప్రధాని మోదీ,హోంమంత్రి అమిత్ షా సలహాలు తీసుకుంటున్నామన్నారు.మణిపూర్ సీఎంగా కొనసాగే నైతిక హక్కు బీరెన్ కు లేదని సీపీఐ తేల్చింది.ఆయన రాజీనామా చేయాలని పట్టుబట్టింది.